Share News

కోట్లు తెచ్చిన చెత్త యానిమేషన్!

ABN , Publish Date - Aug 18 , 2026 | 12:09 PM

ఇటీవల చైనాలో విడుదలైన ఓ యానిమేషన్ సినిమా అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. సాధారణంగా ఒక సినిమా హిట్ కావాలంటే గొప్ప కథ, అద్భుతమైన విజువల్స్, కోట్ల బడ్జెట్, వీటన్నింటికీ మించి భారీ ప్రచారం ఉండాలి. కానీ, ఈ సినిమాకు ట్రోల్స్ అదృష్టాన్ని తెచ్చిపెట్టాయి.

కోట్లు తెచ్చిన చెత్త యానిమేషన్!
Niulai Chinese

ఇంటర్నెట్ డెస్క్: చాలా సినిమాలు షూటింగ్ టైమ్ నుంచి మంచి హైప్‌తో ప్రారంభమై.. రిలీజ్ తర్వాత బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ కొడతాయి. కొన్ని సినిమాలు మాత్రం రిలీజ్‌కు ముందు వరకు అనేక విమర్శలు ఎదుర్కొని ఆ తర్వాత బాక్సాఫీస్ వద్ద ఊహించని అఖండ విజయాన్ని అందుకుంటాయి. అలాంటి వాటిల్లో ఒకటే చైనీస్ యానిమోటెడ్ మూవీ ' 'న్యూ లాయ్'. అత్యంత నాసికరకమైన త్రిడీ యానిమేషన్ అంటూ విమర్శలతో ఈ సినిమా అంతర్జాతీయంగా తెగ వైరల్ అయింది. అలాంటి ఈ సినిమా అద్భుత విజయం అందుకుని అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ సినిమాను కేవలం లక్ష రూపాయలతో తెరకెక్కిచంగా.. రూ.20 కోట్లు రాబట్టింది. మరి.. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..


ఒక ఆవు, పిచ్చుక నేపథ్యంలో తెరకెక్కిన 'న్యూ లాయ్' చిత్రానికి మొదట్లో ఆదరణ కరువైంది. విడుదలైన తొలి 10 రోజుల్లో కేవలం 7,705 యువాన్లు (సుమారు 1,140 డాలర్లు) వసూలు చేసింది. అయితే, దీనికి సంబంధించిన క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఒక్కసారిగా సీన్ పూర్తిగా మారిపోయింది. ప్రముఖ మూవీ ట్రాకింగ్ సైట్ 'మావో యాన్' (Mao Yan) నివేదిక ప్రకారం.. 'న్యూ లాయ్' బాక్సాఫీస్ వద్ద ఏకంగా 11.4 మిలియన్ యువాన్లకు పైగా వసూలు చేసి దూసుకుపోతోంది. హాలీవుడ్ చిత్రాలైన 'ది ఒడిస్సీ', 'స్పైడర్ మ్యాన్' వంటి భారీ సినిమాలకు సైతం ఇది గట్టి పోటీ ఇస్తోంది.


ఈ చిత్రానికి ఇంతటి ఆదరణ లభించడానికి ప్రధాన కారణం సోషల్ మీడియాలో దీనిపై జరుగుతున్న ప్రచారమే. 'ఈ సినిమా చూస్తే 80 నిమిషాలు బాధపడతారు. చూడకపోతే జీవితాంతం పశ్చాత్తాప పడతారు' అంటూ నెటిజన్లు సరదాగా పోస్టులు పెడుతున్నారు. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు, గ్రాఫిక్స్ వీడియోలు సోషల్ మీడియాలో షేర్‌ అయ్యాయి. ‘ఇది మరీ ఘోరంగా ఉంది’, ‘దీని కంటే ఏఐ బాగా తీస్తుంది’ అని మరికొందరు నెటిజన్లు కామెంట్స్ చేశారు.


ఇక చైనాలో 'ఆవు' (Cow/Bull) అనే పదానికి స్టాక్ మార్కెట్ 'బుల్లిష్' (పెరుగుదల) ట్రెండ్‌తో సంబంధం ఉండటంతో, స్టాక్ మార్కెట్ లాభాల్లోకి రావాలని కోరుకునే మదుపర్లు కూడా ఈ సినిమాను విపరీతంగా ఆదరిస్తున్నారు. అసలు సరైన ప్రమోషనల్ పోస్టర్లు కూడా లేని ఈ సినిమాకు వస్తున్న డిమాండ్‌ను చూసి థియేటర్ల సిబ్బందే స్వయంగా తమ చేతులతో పోస్టర్లు గీసి ప్రేక్షకులను ఆకట్టుకుంటుండటం విశేషం.


ఇవి కూడా చదవండి:

గాలే టెస్టులో భారత్ ఓడిపోవచ్చు.. ఆకాశ్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు

సంజయ్ మంజ్రేకర్, కార్తీక్ వాగ్వాదం!

Updated Date - Aug 18 , 2026 | 12:51 PM