Share News

కెనడాలో షాకింగ్ ఘటన.. నడిరోడ్డుపై యువతిపై మహిళ దాడి.. వీడియో వైరల్

ABN , Publish Date - Nov 01 , 2026 | 07:58 AM

కెనడాలోని గ్వెల్ఫ్ నగరంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. రోడ్డుపై తన స్నేహితురాలితో కలిసి ప్రశాంతంగా నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళపై మరో మహిళ అకస్మాత్తుగా దాడికి పాల్పడింది.

కెనడాలో షాకింగ్ ఘటన.. నడిరోడ్డుపై యువతిపై మహిళ దాడి.. వీడియో వైరల్
Guelph Assault

ఇంటర్నెట్ డెస్క్: కెనడాలోని గ్వెల్ఫ్ నగరంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. రోడ్డుపై తన స్నేహితురాలితో కలిసి నడుచుకుంటూ వెళ్తున్న మహిళపై మరో మహిళ అకస్మాత్తుగా దాడికి పాల్పడింది. ఈ అనూహ్య ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం మధ్యాహ్నం సుమారు 3 గంటలకు కొద్దిసేపటి ముందు గ్వెల్ఫ్ నగర కేంద్రంలోని విండ్‌హామ్ స్ట్రీట్ నార్త్, మాక్‌డొనెల్ స్ట్రీట్ కూడలి సమీపంలో ఈ ఘటన జరిగింది. బాధితురాలు తన స్నేహితురాలితో కలిసి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో ఎదురుగా వచ్చిన 35 ఏళ్ల మహిళ అకస్మాత్తుగా ఆమెపై దాడి చేసింది. బాధితురాలి నుదుటిపై ఒక్కసారిగా పిడిగుద్దు కొట్టడంతో ఆమె అదుపుతప్పి రోడ్డుపై కిందపడిపోయింది.


ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. దాడి జరిగిన కొద్దిసేపటికే సమీప ప్రాంతంలోనే అనుమానితురాలిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆమెపై దాడి అభియోగాలు నమోదు చేసి.. శుక్రవారం బెయిల్ విచారణ నిమిత్తం నిర్బంధంలో ఉంచారు. అసలు ఈ దాడికి కారణమేంటి? ఎలాంటి పరిచయం లేని మహిళపై నిందితురాలు ఎందుకు దాడి చేసింది? దాడికి ముందు ఇద్దరి మధ్య ఏదైనా వాగ్వాదం జరిగిందా? అనే విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.


ఇవి కూడా చదవండి:

భారత క్రికెట్ భవిష్యత్తుకు వైభవ్ మంచి పెట్టుబడి: సనత్ జయసూర్య

పాక్ విజయంపై పోస్ట్.. ఇంత బిల్డప్ అవసరమా అంటూ ప్రధాని షరీఫ్‌పై ట్రోల్స్!

Updated Date - Nov 01 , 2026 | 09:05 AM