Share News

ఒళ్లు గగుర్పొడిచే ప్రమాదం.. మెరుపు వేగంతో దూసుకొచ్చిన బైక్..

ABN , Publish Date - Oct 31 , 2026 | 12:18 PM

అతివేగం ఎంత ప్రమాదకరమో నిరూపించే ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వేగంగా వచ్చిన బైక్ ఆగి ఉన్న కారును బలంగా ఢీకొట్టడంతో బైక్‌తో పాటు రైడర్ కూడా ఎగిరిపడ్డాడు.

ఒళ్లు గగుర్పొడిచే ప్రమాదం.. మెరుపు వేగంతో దూసుకొచ్చిన బైక్..
Bike Accident

ఇంటర్నెట్ డెస్క్: సోషల్ మీడియాలో ఓ భయానకమైన రోడ్డు ప్రమాదం అందరినీ షాక్‌కు గురి చేస్తోంది. వైరల్ అవుతున్న వీడియోలో రోడ్డుపై ఆగి ఉన్న ఓ కారు కనిపిస్తుంది. ఇంతలోనే అతివేగంగా వచ్చిన బైక్ అదుపుతప్పి నేరుగా కారు వెనుక భాగాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద తీవ్రతకు బైక్ ఒక్కసారిగా గాల్లోకి ఎగిరి రోడ్డుపై పడిపోయింది. బైక్‌పై ఉన్న రైడర్ కూడా ఎగిరిపడ్డాడు. అటు కారు వెనుక భాగం తీవ్రంగా దెబ్బతినడంతో డిక్కీ నుజ్జునుజ్జయింది. ప్రమాద సమయంలో వచ్చిన భారీ శబ్దం ఢీకొన్న తీవ్రతను తెలియజేస్తోంది.


ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అతివేగంగా వాహనాలు నడిపితే ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయో ఈ ఘటన మరోసారి స్పష్టం చేస్తోంది. అయితే ఈ ప్రమాదం ఎక్కడ, ఎప్పుడు జరిగిందనే వివరాలు తెలియరాలేదు. అలాగే బైక్‌పై ఉన్న రైడర్‌కు ఎంతమేర గాయాలయ్యాయన్న విషయం కూడా స్పష్టత లేదు.

ఈ వీడియో @yogeshsh2135 అనే యూజర్ ఎక్స్‌లో ట్వీట్ పోస్ట్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు రక రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఓ నెటిజన్ ‘కంటికి కనిపించనంత వేగంగా వచ్చాడు ఉన్నాడా? పోయాడా?’ అని, ‘నిజంగా ఒళ్లు గగుర్పొడిచే యాక్సిడెంట్.. ఇంత నిర్లక్ష్యమా..’ అని ఒకరు, ‘అంత వేగంగా వస్తే.. పైకి పోవడం ఖాయం’ అని మరో నెటిజన్ కామెంట్ చేశారు.


ఇవి కూడా చదవండి...

మరికొద్ది రోజుల్లో గగన్‌యాన్ D1 ప్రయోగం.. ఇస్రో చైర్మన్ నారాయణన్ వెల్లడి

కదిరి మున్సిపల్ ఎన్నికల్లో నగదు పంపిణీ ఆరోపణలు.. ఐదుగురి అరెస్ట్

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 31 , 2026 | 12:27 PM