Share News

Road Accident: రెండు బస్సుల నలిగిపోయిన ఆటో.. ఇద్దరు మృతి.. వీడియో వైరల్

ABN , Publish Date - Jan 07 , 2026 | 05:22 PM

భువనేశ్వర్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. రెండు బస్సుల మధ్య ఆటో నలిగిపోవడంతో ఇద్దరు మృతి చెందారు. ఈ దారుణ ఘటనకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతుంది.

Road Accident: రెండు బస్సుల నలిగిపోయిన ఆటో.. ఇద్దరు మృతి.. వీడియో వైరల్
Bhubaneswar Accident

భువనేశ్వర్: ఒక బస్సు డ్రైవర్ నిర్లక్ష్యానికి రెండు నిండు ప్రాణాలు బలయ్యాయి. భువనేశ్వర్‌లోని రుపాలి స్క్వేర్ వద్ద తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఒక ఆటో రిక్షాను వెనుక నుంచి బస్సు ఢీ కొట్టడంతో 62 ఏళ్ల ఆటో డ్రైవర్ మరో వ్యక్తి చనిపోయినట్లు సమాచారం. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోలో కనిపిస్తున్నట్లు సిగ్నల్ వద్ద ఒక బస్సు ఆగిపోవడంతో.. దాని వెనకాలే వచ్చిన ఆటోను నిలిపివేయాల్సి వచ్చింది. కొన్ని సెకన్లలోనే.. ఆటో వెనుక నుంచి ఒక బస్సు వచ్చి బలంగా ఢీకొట్టింది. ముందున్న బస్సు, వెనకున్న బస్సు మధ్య ఆటో నుజ్జు నుజ్జయింది.


వాహనాలు రద్దీగా ఉండే ట్రాఫిక్ జంక్షన్ వద్ద ఆగి ఉన్నప్పుడు ఈ సంఘటన జరిగింది. ప్రమాదంలో ప్రధాన్, రమణి నాయక్ అనే ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ప్రయాణికులు, పోలీసులు రక్షించి దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఆటో రిక్షా ముందుబస్సులో కూర్చున్న ప్రయాణికులు ఈ సంఘటనతో షాక్ అయ్యారు. ‘ఒక నిర్లక్ష్యపు డ్రైవర్ క్షణాల్లో నిండు ప్రాణాలను బలితీసుకున్నాడు’ అని కామెంట్ చేస్తూ ఒక వ్యక్తి ఈ ఘటకు సంబంధించిన వీడియోను ‘X’లో పోస్ట్ చేశాడు.


ఇవీ చదవండి..

పశ్చిమ దేశాల కపటత్వంపై జైశంకర్ సీరియస్‌

వేడెక్కిన తమిళ రాజకీయాలు.. ఎన్డీయే కూటమిలో చేరిన పీఎంకే

Updated Date - Jan 07 , 2026 | 05:55 PM