మానవత్వం చాటుకున్న బైకర్.. ఎండలో శ్రామికులకు ఐస్‌క్రీం పంపిణీ.. వీడియో వైరల్
ABN , Publish Date - Apr 26 , 2026 | 04:05 PM
బెంగళూరులో ఎండలు దంచికొడుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో, రోడ్డు పక్కన కష్టపడే శ్రామికుల దాహార్తిని తీరుస్తూ.. ఒక బైకర్ చేసిన చిన్న ప్రయత్నం ఇప్పుడు సోషల్ మీడియాలో నెటిజన్ల మనసు గెలుచుకుంది.
ఇంటర్నెట్ డెస్క్: బెంగళూరులో ఎండలు దంచికొడుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో, రోడ్డు పక్కన కష్టపడే శ్రామికుల దాహార్తిని తీరుస్తూ.. ఒక బైకర్ చేసిన చిన్న ప్రయత్నం ఇప్పుడు సోషల్ మీడియాలో నెటిజన్ల మనసు గెలుచుకుంది. ఎండలో చెమటలు చిందుస్తూ రోడ్లపై పనిచేసే కూలీల కష్టాన్ని చూసి ఒక బైకర్ చలించిపోయాడు. కేవలం సానుభూతి చూపడమే కాకుండా, తన వంతుగా వారికి కాస్త ఉపశమనం కలిగించాలని నిర్ణయించుకున్నాడు. కూలీలకు చల్లని ఐస్‌క్రీంలను పంచిపెట్టాడు.
ఐస్‌క్రీం అందుకున్న సమయంలో ఆ కూలీల ముఖాల్లో ఆనందం, ఆపై విరిసిన చిరునవ్వులు నెటిజన్లను కదిలించాయి. బెంగళూరు బైకర్ చేసిన ఈ పని, మనుషుల మధ్య ఉండాల్సిన దయ, సానుభూతి ప్రాముఖ్యతను చాటిచెప్పింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. నెటిజన్లు ఎంతో పాజిటీవ్‌గా స్పందిస్తున్నారు. ‘ఈ బైకర్ చేసిన పని అందరికీ స్ఫూర్తిదాయకం’ అని ఒక నెటిజన్ కామెంట్ చేయగా, ‘ఎదుటి వారి ఆనందాన్ని కోరుకునే ఇలాంటి వారికి హ్యాట్సాఫ్’ అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
వైసీపీ దుష్ప్రచారం చేస్తోంది.. మంత్రి నారాయణ ధ్వజం
ట్రంప్ కార్యక్రమం సందర్భంగా కాల్పులు.. అదే హోటల్‌లో కేఏ పాల్..
For More TG News And Telugu News