విమానం రెక్కపై తేనెటీగల గుంపు.. టేకాఫ్ సమయంలో ఏం జరిగిందంటే?
ABN , Publish Date - Jun 14 , 2026 | 07:30 AM
మెక్సికోలోని కాన్‌కన్ నుంచి అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌కు బయలుదేరాల్సిన యునైటెడ్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 1275కు గురువారం ఓ వింత అనుభవం ఎదురైంది. వివరాల్లోకి వెళితే..
ఇంటర్నెట్ డెస్క్: మెక్సికోలోని కాన్‌కన్ నుంచి అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌కు బయలుదేరాల్సిన యునైటెడ్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 1275కు గురువారం ఓ వింత అనుభవం ఎదురైంది. టేకాఫ్ అయ్యే సమయానికి విమానం రెక్కలలో ఒకదానిపై అకస్మాత్తుగా ఒక పెద్ద తేనెటీగల గుంపు వచ్చి వాలింది. ఆ దృశ్యాలను కొందరు ప్రయాణికులు వీడియోలు తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడంతో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే..
వైరల్ అవుతున్న వీడియోలో.. మెక్సికోలోని కాన్‌కన్ నుంచి అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌కు బయలుదేరాల్సిన యునైటెడ్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ రెక్కపై హఠాత్తుగా పెద్ద సంఖ్యలో తేనెటీగల గుంపు వచ్చి వాలాయి. విమానం బయలుదేరడానికి ముందు ఈ అనుకోని సమస్యను గమనించిన విమానాశ్రయ సిబ్బంది వెంటనే అలర్ట్ అయ్యారు. అయితే, విమానం టేకాఫ్ కోసం పైకి లేవడం ప్రారంభించినప్పుడు ఏర్పడిన గాలి ప్రవాహానికి తేనెటీగలన్నీ ఎగిరిపోయాయి. తేనెటీగల గుంపు వల్ల విమానం ప్రయాణంలో కొద్దిపాటి ఆలస్యం జరిగినప్పటికీ.. ఆ తర్వాత ఎలాంటి సాంకేతిక సమస్యలు లేకుండా ప్రయాణం సాఫీగా సాగింది. ఈ సంఘటనను యునైటెడ్ ఎయిర్‌లైన్స్ సంస్థ కూడా తర్వాత ఒక ప్రకటనలో అధికారికంగా ధృవీకరించింది. ప్రస్తుతానికి ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇవి కూడా చదవండి..
అదృష్టం అంటే ఈమెదే.. ఒకే వారంలో రెండు లాటరీల గెలుపు..
మ్యాగీ నూడుల్స్‌లో పురుగులు.. నెస్లే ఇండియా స్పందన ఏంటంటే..