Share News

మంచాన్ని ఇలాక్కూడా వాడతారా.. ఏం చేశాడో చూస్తే నోరెళ్లబెడతారు..

ABN , Publish Date - Jun 13 , 2026 | 07:13 AM

సోషల్ మీడియాలో వినూత్న ప్రయోగాలకు సంబంధించిన వీడియోలు తరచూ వైరల్ అవుతుంటాయి. తాజాగా ఇలాంటి వీడియో ఒకటి తెగ చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి మంచాన్ని వాడిన విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు..

మంచాన్ని ఇలాక్కూడా వాడతారా.. ఏం చేశాడో చూస్తే నోరెళ్లబెడతారు..
Mosquito Net Hack

ఇంటర్నెట్ డెస్క్: సోషల్ మీడియాలో వినూత్న ప్రయోగాలకు సంబంధించిన వీడియోలు తరచూ వైరల్ అవుతుంటాయి. కొందరి ఆలోచనా విధానం చాలా విభిన్నంగా ఉంటుంది. ఇలాంటి వారు నిత్యం సరికొత్త ప్రయోగాలు చేసేందుకు ప్రయత్నిస్తుంటారు. తాజాగా, ఇలాంటి ప్రయోగానికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. సాధారణంగా దోమల బారి నుంచి తప్పించుకోవడానికి చాలా మంది దోమతెరలను వాడుతుంటారు. అయితే ఆ దోమతెరను ఎలా కట్టాలో అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇక్కడ ఒక వ్యక్తి మాత్రం పూర్తిగా భిన్నమైన టెక్నిక్‌ను ఉపయోగించాడు.


సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఒక వ్యక్తి మంచాన్ని తిరగేసి నేలపై పెట్టాడు. ఆ తర్వాత మంచంపై పరుపు, దుప్పటి సర్దుకుంటాడు. అనంతరం దోమతెరను తీసుకువచ్చి, మంచం నాలుగు వైపులా తగిలించాడు. తర్వాత ఎంచక్కా లోపలికి వెళ్లి పడుకున్నాడు. దోమతెరను కట్టడానికి ఇబ్బంది పడే అవసరం లేకుండా చేసిన ఈ వినూత్న ఆలోచన ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది.

ఈ వీడియో @vstechsolution అనే యూజర్ ఎక్స్‌లో ట్వీట్ చేశారు. 'మీరు ఇంతకు ముందెన్నడూ చూసి ఉండని దోమతెర అద్భుతమైన హ్యాక్' అనే క్యాప్షన్‌తో షేర్ చేసిన ఈ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు. ‘ఆహా.. ఈ ప్లాన్ చూసి దోమలు ఓటమిని ఒప్పుకొంటాయి’ అని ఒక నెటిజన్ కామెంట్ చేశారు. ‘దోమల నుంచి తప్పించుకునే ఈ టెక్కిక్ అద్భుతం’ అని మరో నెటిజన్ కామెంట్ చేశారు. భారతీయుల ప్రతిభ అమోఘమని, నిజంగా ఇదొక అద్భుతమైన ఆలోచన అని మరికొందరు ఈ వీడియోపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Updated Date - Jun 13 , 2026 | 07:20 AM