Share News

మహిళ బ్యాగు లాక్కున్న దొంగ.. కారు డ్రైవర్ ఏం చేశాడో చూస్తే..

ABN , Publish Date - Jun 12 , 2026 | 11:30 AM

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో కొన్ని వీడియోలు అప్‌లోడ్ చేసిన క్షణాల్లోనే తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా అలాంటి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మహిళ బ్యాగు లాక్కున్న దొంగ.. కారు డ్రైవర్ ఏం చేశాడో చూస్తే..
Bag Snatcher Viral Video

ఇంటర్నెట్ డెస్క్: సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో కొన్ని వీడియోలు అప్‌లోడ్ చేసిన క్షణాల్లోనే తెగ వైరల్ అవుతుంటాయి.. తాజాగా ఇలాంటి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక మహిళ ఫుట్‌పాత్‌పై నడుచుకుంటూ వెళ్తోంది. అదే సమయంలో ఓ వ్యక్తి వచ్చి ఆమె పక్కనే బైక్ ఆపుతాడు. మహిళను బెదిరించి ఆమె దగ్గర నుంచి బ్యాగ్ లాక్కొని పారిపోయే ప్రయత్నం చేశాడు. ఇదంతా గమనిస్తున్న కారు డ్రైవర్.. దొంగకు గట్టిగా బుద్ధి చెబుతాడు. నేరుగా వెళ్లి బైకును ఢీకొట్టాడు. కిందపడ్డ దొంగ.. బైకును పైకి లేపి, పారిపోయేందుకు ప్రయత్నిస్తుంటాడు. కానీ కారులో ఉన్న వ్యక్తి మళ్లీ ఆ దొంగను ఢీకొడతాడు. దాంతో అతను బ్యాగ్‌ను వదిలేసి.. బతుకు జీవుడా అనుకుంటూ బైక్‌పై ఉడాయిస్తాడు. అప్పటికీ కారు డ్రైవర్.. ఆ దొంగను వదలకుండా కొంత దూరం వరకూ వాహనాన్ని రివర్స్‌లో నడుపుతూ వెంబడించాడు. ఈ వీడియో ఎప్పుడు, ఎక్కడ తీశారో తెలీదు కానీ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.


ఈ వీడియో @gharkekalesh అనే యూజర్ ద్వారా ఎక్స్‌లో షేర్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు రక రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు ‘కర్మ వేగాన్ని చూసి 5G కూడా సిగ్గుపడుతుంది’ అని ఒకరు, ‘కర్మ నిజంగా చాలా త్వరగా వచ్చింది ’ అని రాశారు. మరో యూజర్, ‘ ఆ దొంగ.. లెక్కలు చాలా త్వరగా తీరిపోయాయి’ అని రాశారు. ‘తప్పు చేస్తే.. కర్మ ఫలాలు చాలా త్వరగా లభిస్తాయి’ అంటూ కామెంట్ చేశారు.


ఇవి కూడా చదవండి

మామిడి తొక్కలతో ఇన్ని ఉపయోగాలా! తెలిస్తే ఆశ్చర్యపోతారు

రాబోయే మూడేళ్లు విద్యుత్ ఛార్జీలు పెంచం: మంత్రి గొట్టిపాటి రవికుమార్

Updated Date - Jun 12 , 2026 | 12:05 PM