Share News

గొరిల్లా ఎక్స్‌ప్రెషన్ చూస్తే మతిపోవాల్సిందే.. అచ్చం మనుషుల్లాగే..

ABN , Publish Date - Jun 10 , 2026 | 11:49 AM

ప్రేమ, కోపం, అలకలు, ఆ తర్వాత వచ్చే పశ్చాత్తాపం.. ఇవన్నీ కేవలం మనుషులకే సొంతం అనుకుంటే పొరపాటే! మూగజీవాల్లో కూడా అచ్చం మనలాంటి భావోద్వేగాలే ఉంటాయని నిరూపిస్తోంది ఓ గొరిల్లా. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది..

గొరిల్లా ఎక్స్‌ప్రెషన్ చూస్తే మతిపోవాల్సిందే.. అచ్చం మనుషుల్లాగే..
Gorilla Viral Video

ఇంటర్నెట్ డెస్క్: మనుషుల మధ్య గొడవలు, అలకలు, ఆ తర్వాత వచ్చే పశ్చాత్తాపం వంటివి సర్వసాధారణం. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య మనస్పర్థలు వచ్చినప్పుడు కొందరు కోపంతో ఊగిపోతే, మరికొందరు మాత్రం ఒంటరిగా కూర్చుని తాము చేసిన తప్పును తలుచుకుంటూ దీర్ఘాలోచనలో మునిగిపోతుంటారు. అయితే, మనుషుల్లోనే కాదు.. జంతువుల్లో కూడా ఇలాంటి భావోద్వేగాలు ఉంటాయని ఓ గొరిల్లా నిరూపిస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. తన భాగస్వామితో గొడవపడిన తర్వాత ఓ గొరిల్లా అచ్చం మనిషిలాగే దీర్ఘాలోచనలో మునిగిపోయింది. ఈ సందర్భంగా దాని ఎక్స్‌ప్రెషన్స్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ వీడియో చూసిన వారంతా ‘ఇది చూస్తుంటే అచ్చం మా ఇంట్లో సీన్‌లాగే ఉంది’ అంటూ ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.


ఆ గొరిల్లా పేరు కియోమాసా. జపాన్‌లోని నాగోయాలో ఉన్న హిగాషియామా జూ అండ్ బొటానికల్ గార్డెన్‌లో ఉన్న ఈ గొరిల్లా వయసు 13 సంవత్సరాలు. ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందిన 'షబానీ' అనే సిల్వర్‌బ్యాక్ గొరిల్లా కొడుకే ఈ కియోమాసా కావడం విశేషం. ఇటీవల తన జంటతో చిన్నపాటి వాగ్వాదం జరిగిన తర్వాత కియోమాసా ఒంటరిగా కూర్చుని ఈ ఎక్స్‌ప్రెషన్స్ ఇచ్చింది. నిమిషం నిడివి ఉన్న ఈ వీడియోలో కియోమాసా కుడి చేతిని శరీరానికి అడ్డంగా పెట్టుకుని, ఎడమ చేతిని నోటిపై ఉంచుకుని ఏదో తీవ్రంగా ఆలోచిస్తున్నట్టు కనిపించడం చూపరులను కట్టిపడేస్తోంది. ఈ దృశ్యాలను అక్కడికి వచ్చిన సందర్శకులు తమ కెమెరాల్లో బంధించారు.


ఇవి కూడా చదవండి

వేప ఆకులే కాదు.. పండు కూడా ఔషధమే!

మేం రాలేం.. కావాలంటే క్యాబ్‌ బుక్‌ చేస్తాం!

Updated Date - Jun 10 , 2026 | 01:53 PM