Share News

రాత్రివేళ భూమి ఎలా మెరుస్తోందో చూశారా.. వ్యోమగామి వీడియోకు ప్రశంసలు..

ABN , Publish Date - Jul 14 , 2026 | 01:55 PM

అంతరిక్షం నుంచి భూమి అందాలను చూడడం ఎంతో గొప్ప అనుభూతిని కలిగిస్తుంది. అది అందరికీ సాధ్యమయ్యే పని కాదు. రాత్రివేళ అంతరిక్షం నుంచి భూమిని చూడడం మరింత గొప్ప అనుభవం.

రాత్రివేళ భూమి ఎలా మెరుస్తోందో చూశారా.. వ్యోమగామి వీడియోకు ప్రశంసలు..
Astronaut video

అంతరిక్షం నుంచి భూమి అందాలను చూడడం ఎంతో గొప్ప అనుభూతిని కలిగిస్తుంది. అది అందరికీ సాధ్యమయ్యే పని కాదు. రాత్రివేళ అంతరిక్షం నుంచి భూమిని చూడడం మరింత గొప్ప అనుభవం. అలాంటి అరుదైన దృశ్యాలను యూరోపియన్ అంతరిక్ష సంస్థ (ESA)కు చెందిన వ్యోమగామి సోఫీ అడెనోట్ సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు (Earth at night).


అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) నుంచి సోఫీ ఆ వీడియోను చిత్రీకరించారు. ఆ వీడియోలో రాత్రివేళ భూమి నగరాల వెలుగులు, ఆకాశంలో మెరిసే ఆరోరాలు (ధృవ కాంతులు), దూరంగా ఉదయిస్తున్న చంద్రుడు అద్భుతంగా కనిపించాయి. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. 'అంతరిక్షం నుంచి రాత్రివేళ భూమిని చూడటం మాటల్లో చెప్పలేని అనుభూతి' అంటూ సోఫీ ఆ వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు (Astronaut video).


ఆ వీడియోలో మొదట భూమిపై చీకటిలో మెరిసిపోతున్న నగరాల విద్యుత్ వెలుగులు కనిపిస్తాయి (City lights from space). అనంతరం ఆకుపచ్చ రంగులో మెరిసే ఆరోరాలు ఆకాశంలో అలలలా కదులుతూ కనిపిస్తాయి. చివర్లో అంతరిక్ష అంచు వెనుక నుంచి చంద్రుడు నెమ్మదిగా ఉదయించే దృశ్యం వీక్షకులను మంత్రముగ్ధులను చేస్తోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతరిక్షం నుంచి చూసినప్పుడు భూమి ఎంత అందంగా, ఎంత సున్నితంగా ఉందో ఈ వీడియో మరోసారి గుర్తు చేస్తోందని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.


ఇవి కూడా చదవండి..

నష్టాలతో ప్రారంభమైన సూచీలు.. 300 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్


యూపీలో బోర్డర్ దాటుతూ పట్టుబడిన వ్యక్తి.. అమెరికా నేవీలో పని చేసేవాడినని చెబుతూ..

Updated Date - Jul 14 , 2026 | 02:02 PM