గాల్లో విమానం.. అర్ధనగ్నంగా యువకుడి వీరంగం.. వీడియో వైరల్
ABN , Publish Date - Feb 04 , 2026 | 04:20 PM
విమానం టేకాఫ్ అయ్యాక ఓ యువకుడు వీరంగం సృష్టించాడు. బట్టలు విప్పి అర్ధనగ్నంగా సీట్లపై దూకుతూ నానా హంగామా చేశాడు. సిబ్బంది, తోటి ప్రయాణికులతో గొడవ పడ్డాడు. యువకుడి ప్రవర్తనకు అందరూ విస్తుపోయారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: సాధారణంగా బస్సుల్లోనో, రైళ్లలోనే ప్రయాణికుల మధ్య వివాదాలు చూస్తుంటాం. కానీ, గాల్లో ప్రయాణించే విమానం(plane)లో ఓ యువకుడు సృష్టించిన బీభత్సం ప్రయాణికులను వణికించింది. బట్టలు విప్పేసి అర్ధనగ్నంగా సీట్లపైకి దూకుతూ సదరు యువకుడు చేసిన రచ్చతో విమానంలో ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్(Emergency landing) చేయాల్సి వచ్చింది.
అసలేం జరిగిందంటే..
వియత్నాం(Vietnam)లోని సహా ట్రాంగ్ నుంచి బ్యాంకాక్ (Bangkok) బయలుదేరిన ‘ఎయిర్ ఏషియా’ అంతర్జాతీయ విమానంలో ఈ ఘటన చోటు చేసుకుంది. విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఒక యువకుడు ఊహించని విధంగా ప్రవర్తించాడు. అందరూ చూస్తుండగానే తన బట్టలు విప్పడం మొదలుపెట్టాడు. అది చూసి షాక్ తిన్న సిబ్బంది వెంటనే అతన్ని వారించగా, వారిపై గొడవకు దిగాడు. అంతటితో ఆగకుండా సీట్లపై నుంచి దూకుతూ తోటి ప్రయాణికులను భయభ్రాంతులకు గురి చేశాడు.
అత్యవసర ల్యాండింగ్..
యువకుడి విపరీత చేష్టల వల్ల పరిస్థితి చెయ్యి దాటిపోతోందని గ్రహించిన పైలట్లు, సిబ్బంది వెంటనే విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. విమానం భూమిపై ల్యాండ్ కాగానే, ఆ యువకుడు బయటకు పరిగెత్తాడు. అప్రమత్తమైన పోలీసులు అతన్ని వెంబడించి అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇవి కూడా చదవండి..
మిత్ర ద్రోహి.. దేశ ద్రోహి.. పార్లమెంట్ వెలుపల రాహుల్ గాంధీ, బీజేపీ ఎంపీ మధ్య వాగ్వాదం..
నా నేతృత్వంలోనే ప్రభుత్వం ఏర్పాటు