Share News

వామ్మో.. రోబోల టాలెంట్ మామూలుగా లేదుగా.. వీడియో వైరల్..

ABN , Publish Date - Aug 23 , 2026 | 03:13 PM

ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా వేలాది రోబోలు కలిసి చేసిన ఓ విన్యాసం గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. వావ్.. రోబోల టాలెంట్ మామూలుగా లేదుగా.. అంటూ కామెంట్లు చేస్తున్నారు..

వామ్మో.. రోబోల టాలెంట్ మామూలుగా లేదుగా.. వీడియో వైరల్..
Guinness World Record

ఇంటర్నెట్ డెస్క్: టెక్నాలజీ రోజురోజుకూ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతోందో చూపించే అద్భుత దృశ్యం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వేలాది రోబోలు కలిసి లయబద్ధంగా వేసిన డాన్స్.. గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కింది. ఇందుకు సంబంధించిన వీడియోను గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌కు సంబంధించిన సోషల్ మీడియాా అకౌంట్లలో షేర్ చేశారు. ఇటలీకి చెందిన 'టిమ్ ఎస్పీఏ' కంపెనీ.. ఏకకాలంలో 1,372 రోబోలను నృత్యం చేయించి ప్రపంచ రికార్డు నెలకొల్పింది. కచ్చితమైన ప్రోగ్రామింగ్, సమన్వయం, ఆధునిక రోబోటిక్స్‌తో ఇంత భారీ సంఖ్యలో రోబోలను ఒకే లయలో డాన్స్ చేయించడం సాంకేతిక రంగంలో మరో మైలురాయిగా నిలిచింది.


ఇదిలా ఉంటే.. చైనాకు చెందిన డబ్ల్యుఎల్ ఇంటెలిజెంట్ టెక్నాలజీ కో., లిమిటెడ్., 2017లో 1,069 రోబోట్‌లతో ఒకే సమయంలో.. ఒకే పాటకు నృత్యం చేయించి ప్రపంచ రికార్డును నెలకొల్పింది. రోబోలన్నీ కలిసి ఒకేసారి ముందుకు, వెనక్కి లయబద్ధంగా కదులుతూ డాన్స్ చేయడం విశేషం. ప్రస్తుతం ఇటాలియన్ కంపెనీ 1,372 రోబోలతో ఒకేసారి నృత్యం చేయించి.. చైనా రికార్డును బద్దలు కొట్టింది, గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్ వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఈ రికార్డు కూడా భవిష్యత్తులో బద్దలయ్యే అవకాశం ఉంది. తదుపరి ఎన్ని రోబోలు ఒకేసారి డ్యాన్స్ చేస్తాయో.. ఏ సంస్థ కొత్త రికార్డు సృష్టిస్తుందో చూడాల్సి ఉంది.


వార్తలు కూడా చదవండి...

ఉద్యోగాలు, ప్రతిభకు దేశంలోనే నంబర్‌వన్ సిటీగా విశాఖ: సీఎం చంద్రబాబు

పవన్ కల్యాణ్ దిశానిర్దేశం.. శరవేగంగా అడవుల పునరుద్ధరణ కార్యక్రమం

ఈ ఏడాది మరో 3వేల టీచర్ పోస్టుల భర్తీ: మంత్రి లోకేశ్

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Aug 23 , 2026 | 04:00 PM