ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్
ABN , First Publish Date - Mar 03 , 2026 | 06:51 AM
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.
Live News & Updates
-
Mar 03, 2026 08:48 IST
సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లోని అమెరికా ఎంబసీపై ఇరాన్ డ్రోన్ దాడి
ఎంబసీ భవనానికి స్వల్ప నష్టం.. ఖాళీగా ఉండడంతో తప్పిన ప్రాణాపాయం
ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్
-
Mar 03, 2026 08:02 IST
తిరుపతి: సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా ఆలయాల మూసివేత
తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం ఉ.9 గంటలకు మూసివేత
గ్రహణం కారణంగా పద్మావతి అమ్మవారి ఆలయం మూసివేత
ఉ.9 నుంచి రాత్రి 7:30 వరకు మహాద్వారం మూసివేత
-
Mar 03, 2026 08:01 IST
నా ఫేవరెట్ టాలీవుడ్ హీరో అల్లు అర్జున్: సంజు
అల్లు అర్జున్ అన్నీ సినిమాలను చూస్తుంటాను: సంజు
మహేశ్ బాబు అంటే కూడా ఇష్టమే: సంజు
మహేశ్ బాబు స్టైల్ బాగుంటుంది: సంజు
ర్యాపిడ్ ఫైర్ చిట్ చాట్‌లో వెల్లడించిన సంజు
-
Mar 03, 2026 07:58 IST
హోలీ శుభాకాంక్షలు..
ప్రజలకు హోలీ శుభాకాంక్షలు చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్
హోలీ పండుగ మనందరి జీవితాల్లో కొత్త రంగులు అద్దుతుంది: చంద్రబాబు
చెడుపై గెలిచిన మంచికి సంకేతం హోలీ: నారా లోకేశ్
-
Mar 03, 2026 07:36 IST
హైదరాబాద్: పాతబస్తీలో కొనసాగుతున్న ఆందోళనలు
ఇజ్రాయెల్, అమెరికాకు వ్యతిరేకంగా నిరసనలు
ఖమేనీ ఫొటోలతో పాతబస్తీలో ముస్లింల ర్యాలీలు
-
Mar 03, 2026 07:35 IST
నేడు దేశవ్యాప్తంగా హోలీ వేడుకలు
ఉస్మానియా కాలేజీలో పాల్గొననున్న రాంచందర్‌రావు
హోలీ సందర్భంగా హైదరాబాద్‌లో వైన్స్, బార్లు బంద్
సాయంత్రం 6గంటల వరకు వైన్స్, బార్లు బంద్
-
Mar 03, 2026 07:21 IST
శ్రీవారి ఆలయం మూసివేత
తిరుమల: నేడు చంద్రగ్రహణం కారణంగా శ్రీవారి ఆలయం మూసివేత
ఉ.9గంటలకు గర్భాలయంతోపాటు మహాద్వారం తలుపులు మూసివేత
-
Mar 03, 2026 07:08 IST
బంగారం, వెండి ధరలు ఇవే..
ఈరోజు ఉదయం 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.1,70,500
ఇక, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,56,290
ఇక, దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు రూ.1,70,650
22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.1,56,440
హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.3.15 లక్షలు
-
Mar 03, 2026 06:55 IST
గల్ఫ్‌లో చమురు నౌకలకు ఇన్సూరెన్స్ రద్దు
నౌకలకు వార్ రిస్క్ కవరేజ్ ఇన్సూరెన్స్ రద్దు
దాడులతో ఇప్పటికే 4 ఆయిల్ ట్యాంకర్లు ధ్వంసం
హర్‌మూజ్ జలసంధిలో నిలిచిపోయిన 150 నౌకలు
LNG గ్యాస్ ఉత్పత్తిని ఆపేసిన ఖతార్
-
Mar 03, 2026 06:54 IST
ఇరాన్‌లో టీవీ, రేడియో హెడ్‌క్వార్టర్స్‌పై దాడులు
టీవీ, రేడియో హెడ్‌క్వార్టర్స్ కూల్చేసినట్టు..
అధికారికంగా ఇజ్రాయెల్ మిలటరీ ప్రకటన
కువైట్‌లో అమెరికా ఎంబసీపై డ్రోన్లతో దాడులు
దాడులతో దెబ్బతిన్న అమెరికా ఎంబసీ భవనం
ప్రాణ భయంతో ఇరాన్ వీడుతున్న ప్రజలు
-
Mar 03, 2026 06:51 IST
ఇరాన్‌పై కొనసాగుతున్న అమెరికా, ఇజ్రాయెల్ దాడులు
ఇప్పటివరకూ 1,240పైగా స్థావరాలపై దాడులు
మరిన్ని దేశాలకు విస్తరిస్తున్న యుద్ధం
ఇరాన్ యుద్ధంతో గల్ఫ్ దేశాలకు భారీ నష్టం
ఇరాన్ యుద్ధంతో ఇప్పటివరకూ 600మంది మృతి