మెదక్ జిల్లాలో అమూల్ డెయిరీ ప్లాంట్‌కు భూమిపూజ.. పాల్గొన్న కిషన్‌రెడ్డి
ABN, Publish Date - Oct 04 , 2026 | 04:56 PM
మెదక్ జిల్లా తూప్రాన్ మండలంలోని బ్రహ్మణపల్లిలో అమూల్ సంస్థకు చెందిన తొలి అత్యాధునిక ప్లాంట్‌కు (సాబర్ డైరీ తెలంగాణ ప్రాజెక్ట్) ఆదివారం భూమిపూజ జరిగింది. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులు శ్రీధర్ బాబు, గడ్డం వివేక్ వెంకటస్వామి, ఎంపీ రఘునందన్ రావు, కంపెనీ చైర్మన్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. భూమి పూజ అనంతరం రైతులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడారు.
1/7
మెదక్ జిల్లా తూప్రాన్ మండలంలోని బ్రహ్మణపల్లిలో అమూల్ సంస్థకు చెందిన తొలి అత్యాధునిక ప్లాంట్‌కు (సాబర్ డైరీ తెలంగాణ ప్రాజెక్ట్) ఆదివారం భూమిపూజ జరిగింది.
2/7
ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులు శ్రీధర్ బాబు, గడ్డం వివేక్ వెంకటస్వామి, ఎంపీ రఘునందన్ రావు, కంపెనీ చైర్మన్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
3/7
భూమి పూజ అనంతరం రైతులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడారు.
4/7
ప్రపంచంలోనే పాల ఉత్పత్తిలో భారతదేశం ముందంజలో ఉందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. శ్వేత విప్లవంలో తెలంగాణ కీలక పాత్ర పోషించాలని పేర్కొన్నారు.
5/7
తెలంగాణ నడిబొడ్డున తూప్రాన్‌లో అమూల్ డెయిరీ ఏర్పాటుకు భూమి పూజ చేశామని కిషన్‌రెడ్డి తెలిపారు. రూ.400 కోట్లతో ఈ పరిశ్రమను ఏర్పాటు చేస్తున్నారని వెల్లడించారు. వచ్చే 18 నెలల్లో ఈ ప్లాంట్ నిర్మాణం పూర్తవుతుందని చెప్పుకొచ్చారు.
6/7
ఈ పరిశ్రమతో స్థానిక యువత, మహిళలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించనున్నాయని అన్నారు. తెలంగాణలో ఇలాంటి పరిశ్రమలు రావడం సంతోషకరమైన విషయమని కిషన్‌రెడ్డి చెప్పారు.
7/7
గ్రామాల్లో కో ఆపరేటివ్ సోసైటీలో రాజకీయాలు చేరిపోయి నిర్వీర్యం అయ్యాయని తెలిపారు. ఈ సహకార సంఘాలను పునర్నిర్మాణం చేసుకోవాలని సూచించారు. రైతులంతా కలిసి ఓ కో ఆపరేటివ్ సొసైటీ ఏర్పాటు చేసుకోవాలని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.
Updated at - Oct 04 , 2026 | 04:57 PM