నల్లగొండ జిల్లాలో హ్యామ్ రోడ్ల పథకానికి శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్‌రెడ్డి
ABN, Publish Date - Jun 29 , 2026 | 06:55 AM
రోడ్లు, భవనాల శాఖ ద్వారా రూ.13,006.27 కోట్లతో చేపట్టిన హ్యామ్ రోడ్ల పథకానికి ఆదివారం నల్లగొండ జిల్లా కనగల్ వద్ద ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌లతో కలిసి సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ పథకానికి సంబంధించి అక్కడ ఏర్పాటు చేసిన పైలాన్‌ను ఆవిష్కరించారు. అక్కడి నుంచి నల్లగొండ జిల్లా కేంద్రానికి చేరుకొని అక్కడ రూ.83 కోట్లతో చేపట్టిన తాగునీటి పథకానికి శంకుస్థాపన చేశారు.
1/13
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నల్గొండ జిల్లాలో ఆదివారం పర్యటించి, పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
2/13
రోడ్లు, భవనాల శాఖ ద్వారా రూ.13,006.27 కోట్లతో చేపట్టిన హ్యామ్ రోడ్ల పథకానికి ఆదివారం నల్లగొండ జిల్లా కనగల్ వద్ద ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌లతో కలిసి సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేశారు.
3/13
అక్కడి నుంచి నల్లగొండ జిల్లా కేంద్రానికి చేరుకొని అక్కడ రూ.83 కోట్లతో చేపట్టిన తాగునీటి పథకానికి శంకుస్థాపన చేశారు.
4/13
అనంతరం పట్టణంలోని ఎన్‌జీ కాలేజీ మైదానంలో జరిగిన బహిరంగ సభలో సీఎం మాట్లాడుతూ.. ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ఫై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీపై విమర్శలు చేశారు.
5/13
‘రెండున్నరేళ్లలో రేవంత్‌రెడ్డి ఏం తెచ్చారు, ఏం చేశారు అని అడుగుతున్నారు. వారికి సవాల్ విసురుతున్నా. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలన, పన్నెండేళ్ల కేంద్రంలోని బీజేపీ పాలన, రెండున్నరేళ్ల మా ప్రజాపాలనపై అసెంబ్లీ, మండలి ప్రత్యేక సమావేశాలు నిర్వహించి ప్రత్యేకంగా చర్చిద్దాం. తెలంగాణ ప్రజలకు ఎవరం ఏం చేశామో తేలుద్దాం’ అని సీఎం రేవంత్ సవాల్ విసిరారు.
6/13
మూసీ ప్రక్షాళనకు ఎవరు అడ్డుపడ్డా, ఎన్ని ఆటంకాలు సృష్టించినా తమ ప్రభుత్వం వెనక్కి తగ్గబోదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. అడ్డొచ్చిన వారిని మూసీలో వేసి తొక్కి మరీ ప్రక్షాళన చేసి తీరతామని ప్రకటించారు.
7/13
మూసీ కాలుష్యంతో ప్రజలు ఎంత గోస అనుభవిస్తున్నారో చూస్తున్నామని సీఎం తెలిపారు.
8/13
ప్రధాని మోదీ.. సబర్మతి నదిని, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి.. యమునా నదిని ప్రక్షాళన చేసిన దానికంటే గొప్పగా మూసీని ప్రక్షాళించి ప్రపంచ దేశాల నుంచి ఇక్కడకు వచ్చి చూసి వెళ్లేలా తీర్చిదిద్దుతామని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పుకొచ్చారు.
9/13
బీఆర్‌ఎస్ నేతలు పదే పదే త్యాగాలు చేశామని, తమ త్యాగాల పునాదుల మీద రాష్ట్రం ఏర్పాటైందని చెబుతున్నారని, అసలు త్యాగాలు ఎవరివని సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు.
10/13
రాజీనామాలు, కలెక్షన్లు, సెలక్షన్లు, ఎలక్షన్లతో పబ్బం గడిపిన మీది త్యాగమైతే.. తెలంగాణ తొలి ఉద్యమంలో మంత్రి పదవికి రాజీనామా చేసి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైతే తప్ప పదవులు చేపట్టబోనని ప్రతిన బూనిన కొండా లక్ష్మణ్‌బాపూజీ త్యాగం ఏమవుతుంది? అని సీఎం రేవంత్‌రెడ్డి నిలదీశారు.
11/13
మలిదశ తెలంగాణ ఉద్యమంలో తన మంత్రి పదవికి రాజీనామా చేసి, తన ఆరోగ్యాన్ని పణంగా పెట్టి నల్లగొండ గడ్డపై ఆమరణ దీక్ష చేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి త్యాగం ఏమవుతుంది? అని సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు.
12/13
రూ.100తో పెట్రోల్ తెచ్చుకుని, అర్ధరూపాయి పెట్టి అగ్గిపెట్టె తెచ్చుకోలేని అగ్గిపెట్టెరావుది త్యాగమా? లేక ఒంటి నిండా మంట పెట్టుకుని నిలువునా దహించుకుపోయిన అమరుడు శ్రీకాంతాచారిది త్యాగమా? అని సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నల వర్షం కురిపించారు.
13/13
మీవి త్యాగాలైతే.. కానిస్టేబుల్ కిష్టయ్య, ఇషాన్‌రెడ్డి, వేణుగోపాల్‌రెడ్డి, యాదయ్య చేసినవి ఏమవుతాయి? అని సీఎం రేవంత్‌రెడ్డి నిలదీశారు.
Updated at - Jun 29 , 2026 | 07:03 AM