హైదరాబాద్‌లో తమ్మిడికుంటను ప్రారంభించిన సీఎం రేవంత్‌రెడ్డి, నాగార్జున
ABN, Publish Date - Nov 12 , 2026 | 07:35 AM
హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో రూ.20 కోట్లతో హైడ్రా పునరుద్ధరించిన తమ్మిడికుంటను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, సినీనటుడు అక్కినేని నాగార్జున, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి బుధవారం సాయంత్రం ప్రారంభించారు.
1/15
హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో రూ.20 కోట్లతో హైడ్రా పునరుద్ధరించిన తమ్మిడికుంటను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, సినీనటుడు అక్కినేని నాగార్జున, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి బుధవారం సాయంత్రం ప్రారంభించారు.
2/15
ఆక్రమణలు, కాలుష్యం తదితర సమస్యలతో గతంలో దెబ్బతిన్న తమ్మిడికుంట చెరువును హైడ్రా రూ.20 కోట్ల వ్యయంతో పునరుద్ధరించింది.
3/15
ఆధునిక హంగులతో అభివృద్ధి చేసిన ఈ చెరువును హైడ్రా డెవలప్ చేసింది.
4/15
హైదరాబాద్ నగరంలో చెరువుల పరిరక్షణ, పునరుద్ధరణకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తున్న నేపథ్యంలో తమ్మిడికుంట అభివృద్ధి ప్రాజెక్టు ప్రాధాన్యం సంతరించుకుంది.
5/15
ముఖ్యంగా ఐటీ కారిడార్ పరిధిలో ఉన్న ఈ చెరువు పునరుద్ధరణతో పరిసర ప్రాంతాలకు కొత్త రూపు వచ్చింది.
6/15
రూ.20 కోట్ల నిధులతో హైడ్రా చేపట్టిన పనులు పూర్తికావడంతో చెరువు ప్రజలకు అందుబాటులోకి వచ్చింది.
7/15
చెరువుల పరిరక్షణతో పాటు నగరంలో పర్యావరణ సమతుల్యతను కాపాడటం, నీటి వనరులను భవిష్యత్ తరాలకు అందించడం వంటి అంశాలు ఈ ప్రాజెక్టు ద్వారా ప్రాధాన్యం పొందుతున్నాయి.
8/15
మూసీ ప్రక్షాళన చేయాల్సిందేనని.. ఏ ఒక్కరికీ నష్టం జరగకుండా ఆ నది పునరుజ్జీవ ప్రాజెక్టును చేపడతామని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.
9/15
ఇందుకు రాజకీయాలకతీతంగా సహకరించాలని.. అందరూ ఒకే వేదికపైకి రావాలని రేవంత్‌రెడ్డి కోరారు.
10/15
55 కిలోమీటర్ల మేర ఉన్న మూసీ ప్రక్షాళనలో భాగంగా.. 21 కిలోమీటర్ల మేర పనులకు అన్ని అనుమతులూ వచ్చాయని, త్వరలో పనులు మొదలు పెడతామని ముఖ్యమంత్రి తెలిపారు.
11/15
ప్రపంచంలో ఎక్కడైనా నదీ పరీవాహక ప్రాంతాల్లో అభివృద్ధి జరిగిందని, అమెరికా, సింగపూర్, దక్షిణ కొరియా వంటి దేశాలు నదుల తీర ప్రాంతాలను పర్యాటక, ఆర్థిక చోదక శక్తులుగా తీర్చిదిద్దాయని సీఎం పేర్కొన్నారు.
12/15
అదే తరహాలో హైదరాబాద్, తెలంగాణను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుపోవాలన్నదే తన ఆలోచన అని స్పష్టం చేశారు. ‘నా సంకల్పం మంచిదైనప్పుడు.. నేను చేసే పని భవిష్యత్ తరాలకు ఉపయోగపడుతున్నప్పుడు. కొందరికి నష్టం జరుగుతుందని ఎందుకు వెనక్కి తగ్గాలి’ అని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు.
13/15
ఔటర్ లోపల ఉన్న 1.34 కోట్ల మందితోపాటు.. నల్గొండ జిల్లాలోని 30 లక్షల మంది మూసీ కాలుష్యంతో ఇబ్బంది పడుతున్నారని, ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాల్సిన అవసరముందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు.
14/15
మెడికల్, ఇతర వ్యర్థాల డంపింగ్ కేంద్రంగా మూసీ నది మారిందని, ఈ పరిస్థితిని పూర్తిగా మార్చి ఆ నదిని ప్రజలకు ఉపయుక్తంగా, రాష్ట్ర ఆదాయానికి చోదక శక్తిగా తీర్చిదిద్దుతామని సీఎం తెలిపారు.
15/15
అలాగే.. హైదరాబాద్‌లో చెరువుల చెర విడిపించాల్సిందేనని, కబ్జాదారుల నుంచి విముక్తి కల్పించాల్సిందేనని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.
Updated at - Nov 12 , 2026 | 07:56 AM