పరిగిలో సీఎం రేవంత్‌రెడ్డి ఎన్నికల ప్రచారం

ABN, Publish Date - Feb 08 , 2026 | 08:03 AM

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శనివారం ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిగి నియోజకవర్గంలో పర్యటించారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించారు.

పరిగిలో సీఎం రేవంత్‌రెడ్డి ఎన్నికల ప్రచారం 1/9

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శనివారం ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిగి నియోజకవర్గంలో పర్యటించారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అభ్యర్థుల తరఫున రేవంత్‌రెడ్డి ప్రచారం నిర్వహించారు.

పరిగిలో సీఎం రేవంత్‌రెడ్డి ఎన్నికల ప్రచారం 2/9

పరిగి నియోజకవర్గంలో జరిగిన ప్రజాపాలన ప్రగతిబాట సభకు విచ్చేసిన సీఎం రేవంత్‌రెడ్డి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.

పరిగిలో సీఎం రేవంత్‌రెడ్డి ఎన్నికల ప్రచారం 3/9

ఈ సందర్భంగా సీఎం రేవంత్‌‌రెడ్డికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నేతలు ఘన స్వాగతం పలికారు.

పరిగిలో సీఎం రేవంత్‌రెడ్డి ఎన్నికల ప్రచారం 4/9

ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగించారు. ఈ నెల 11వ తేదీన జరిగే మున్సిపల్ ఎన్నికల్లో హస్తం గుర్తుపై ఓటేసి, కాంగ్రెస్‌ని గెలిపించేందుకు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ప్రజలు సిద్ధంగా ఉన్నారని రేవంత్‌రెడ్డి తెలిపారు.

పరిగిలో సీఎం రేవంత్‌రెడ్డి ఎన్నికల ప్రచారం 5/9

ఇందిరమ్మ చీరలు కట్టి, నిండైన తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీకలుగా తమ ఆడబిడ్డలు కాంగ్రెస్ గెలుపులో కీలక పాత్ర పోషించబోతున్నారని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.

పరిగిలో సీఎం రేవంత్‌రెడ్డి ఎన్నికల ప్రచారం 6/9

అభివృద్ధి, సంక్షేమాన్ని జోడెద్దుల్లా ముందుకు తీసుకెళ్తున్న కాంగ్రెస్ గెలుపును ఎవరూ ఆపలేరని ఈ రోజు పరిగి సభ తర్వాత తనకు అర్థమైందని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పుకొచ్చారు.

పరిగిలో సీఎం రేవంత్‌రెడ్డి ఎన్నికల ప్రచారం 7/9

ఆడబిడ్డల ఆర్థిక స్వావలంబనలో భాగంగా, వారిని కోటీశ్వరులను చేయాలనే ప్రజా ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా ఈ రోజు పరిగి ప్రజాపాలన - ప్రగతి బాట సభలో జిల్లా మహిళా సంఘాల ప్రతినిధులకు రూ.567 కోట్ల చెక్కును అందజేశానని సీఎం రేవంత్‌‌రెడ్డి పేర్కొన్నారు.

పరిగిలో సీఎం రేవంత్‌రెడ్డి ఎన్నికల ప్రచారం 8/9

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ శ్రేణులు కష్టపడి పనిచేయాలని సీఎం రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు.

పరిగిలో సీఎం రేవంత్‌రెడ్డి ఎన్నికల ప్రచారం 9/9

మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను తామే గెలవబోతున్నామని సీఎం రేవంత్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

Updated at - Feb 08 , 2026 | 08:12 AM