హైదరాబాద్‌లో కాల్పుల కలకలం.. ఓ వ్యక్తికి గాయాలు

ABN, Publish Date - Jan 31 , 2026 | 11:01 AM

హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న కోటి ప్రాంతంలో శనివారం దుండగులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. జనం రద్దీగా ఉండే ప్రాంతంలో ఇలాంటి దోపిడీ జరగడం నగర భద్రతపై ఆందోళన కలిగిస్తోంది. కోటి ఎస్‌బీఐ ఏటీఎం వద్ద దుండగులు రిన్షద్ అనే వ్యక్తిపై కాల్పులు జరిపారు.

హైదరాబాద్‌లో కాల్పుల కలకలం..  ఓ వ్యక్తికి గాయాలు 1/6

హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న కోటి ప్రాంతంలో శనివారం దుండగులు కాల్పులు జరిపారు.

హైదరాబాద్‌లో కాల్పుల కలకలం..  ఓ వ్యక్తికి గాయాలు 2/6

ఈ కాల్పుల ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. జనం రద్దీగా ఉండే ప్రాంతంలో ఇలాంటి దోపిడీ జరగడం నగర భద్రతపై ఆందోళన కలిగిస్తోంది.

హైదరాబాద్‌లో కాల్పుల కలకలం..  ఓ వ్యక్తికి గాయాలు 3/6

కోటి ఎస్‌బీఐ ఏటీఎం వద్ద దుండగులు ఓ వ్యక్తిపై కాల్పులు జరిపారు.

హైదరాబాద్‌లో కాల్పుల కలకలం..  ఓ వ్యక్తికి గాయాలు 4/6

ఏటీఎంలో నగదు డిపాజిట్ చేయడానికి వచ్చిన రిన్షద్ అనే వ్యక్తిపై ఆగంతకులు కాల్పులు జరిపి రూ. 6 లక్షల నగదు దోచుకున్నారు.

హైదరాబాద్‌లో కాల్పుల కలకలం..  ఓ వ్యక్తికి గాయాలు 5/6

ఈ ఘటనలో రిన్షద్‌కు గాయాలయ్యాయి. గాయాలైన వ్యక్తిని వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించి వైద్యం అందజేస్తున్నారు.

హైదరాబాద్‌లో కాల్పుల కలకలం..  ఓ వ్యక్తికి గాయాలు 6/6

పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. దుండగుల కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

Updated at - Jan 31 , 2026 | 11:17 AM