420 హామీలు ఇచ్చి తెలంగాణ ప్రజలను మోసం చేశారు: కాంగ్రెస్ నేతలపై కేటీఆర్ ఫైర్
ABN, Publish Date - Feb 09 , 2026 | 03:18 PM
బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సోమవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక బీ ఆర్ అంబేద్కర్ సెంటర్‌లో కార్నర్ మీటింగ్‌లో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డిపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నాంపల్లిలోని ఫోరెన్సిక్ ల్యాబ్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో ఓటుకు నోటు కేసు సాక్ష్యాలు కాల్చేశారని ఆరోపించారు.
1/9
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం నేటితో అంటే.. సోమవారం (09-02-2026)తో ముగియనుంది. ఈ ఎన్నికల్లో విజయం సాధించడం కోసం రాజకీయ పార్టీల అగ్రనేతలు రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు జరుపుతున్నారు.
2/9
బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సోమవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా పలు చోట్ల ఆయన కార్నర్ మీటింగ్‌లో పాల్గొన్నారు.
3/9
సీఎం రేవంత్‌రెడ్డిపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నాంపల్లిలోని ఫోరెన్సిక్ ల్యాబ్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో ఓటుకు నోటు కేసు సాక్ష్యాలను కాల్చేశారని ఆరోపించారు.
4/9
బీఆర్ఎస్ పార్టీపై అనుచిత వ్యాఖ్యలు చేసే సీఎం రేవంత్‌రెడ్డికి పోలింగ్ కేంద్రంలో ఓట్లు వేయడం ద్వారా బుద్ధి చెప్పాలని ప్రజలకు ఆయన సూచించారు.
5/9
420 హామీలు ఇచ్చి తెలంగాణ ప్రజలను మోసం చేశారంటూ కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలపై ధ్వజమెత్తారు. భూపాలపల్లి సింగరేణిని ఆగం చేసేందుకు చూస్తున్నారని ఆరోపణలు చేశారు.
6/9
తులం బంగారం, రూ.4 వేల పెన్షన్ వచ్చినోళ్లు కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని స్పష్టం చేశారు. కేసీఆర్ పథకాలు తీసుకుంటున్న వాళ్లు బీఆర్ఎస్‌కు ఓటు వేయాలని పిలుపునిచ్చారు.
7/9
మరోసారి మోసపోయి భస్మాసుర చేయి లాంటి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయొద్దని సూచించారు.
8/9
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని కేంద్రం పట్టించుకోవడం లేదంటూ మోదీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ12 ఏళ్లలో తెలంగాణకు బీజేపీ నయాపైసా పని చేయలేదంటూ మండిపడ్డారు.
9/9
ఈ కార్నర్ మీటింగ్‌కు భారీగా ప్రజలు పోటెత్తారు. స్థానిక బీ ఆర్ అంబేద్కర్ సెంటర్‌లో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ మీటింగ్‌లో బండ ప్రకాశ్, గండ్ర వెంకటరమణ రెడ్డితోపాటు జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షురాలు జ్యోతి తదితరులు పాల్గొన్నారు
Updated at - Feb 09 , 2026 | 03:21 PM