కొడంగల్‌లో సీఎం రేవంత్‌రెడ్డి ఆత్మీయ సమావేశం

ABN, Publish Date - Oct 23 , 2026 | 01:39 PM

దసరా పండుగను పుర స్కరించుకొని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన సొంత నియోజకవర్గం కొడంగల్‌లో ప్రజలను కలుసుకుని శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఏటా దసరా పండుగ తర్వాతి రోజు ఆయన తన నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలను కలవడం ఆనవాయితీగా వస్తోంది.

కొడంగల్‌లో సీఎం  రేవంత్‌రెడ్డి  ఆత్మీయ సమావేశం 1/5

దసరా పండుగను పురస్కరించుకొని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన సొంత నియోజకవర్గం కొడంగల్‌లో ప్రజలను కలుసుకుని శుభాకాంక్షలు తెలిపారు.

కొడంగల్‌లో సీఎం  రేవంత్‌రెడ్డి  ఆత్మీయ సమావేశం 2/5

ప్రతి ఏటా దసరా పండుగ తర్వాతి రోజు రేవంత్‌రెడ్డి తన నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలను కలవడం ఆనవాయితీగా వస్తోంది.

కొడంగల్‌లో సీఎం  రేవంత్‌రెడ్డి  ఆత్మీయ సమావేశం 3/5

ఇందులో భాగంగా గురువారం హైదరాబాద్‌ నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరిన సీఎం మధ్యాహ్నం 2:15 గంటలకు కొడంగల్‌కు చేరుకున్నారు. పట్టణంలోని తాండూరురోడ్డు మార్గంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌ వద్ద ముఖ్యమంత్రికి వికారాబాద్‌, నారాయణపేట జిల్లాల కలెక్టర్లు దీపక్‌ తివారీ, ప్రియాంక, ఎస్పీ స్నేహా మెహ్రా, వివిధ శాఖల అధికారులు, కాంగ్రెస్‌ నాయకులు పుష్పగుచ్ఛాలతో ఘనస్వాగతం పలికారు.

కొడంగల్‌లో సీఎం  రేవంత్‌రెడ్డి  ఆత్మీయ సమావేశం 4/5

అక్కడి నుంచి సీఎం రేవంత్‌రెడ్డి నేరుగా కొడంగల్‌లోని శ్రీ మహాలక్ష్మి వేంకటేశ్వరస్వామి ఆలయానికి వెళ్లి.. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించారు. పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

కొడంగల్‌లో సీఎం  రేవంత్‌రెడ్డి  ఆత్మీయ సమావేశం 5/5

శాస్త్రోక్తంగా, నాణ్యతాయుతంగా పనులు చేపట్టాలని సూచించారు. అధికారులకు, నిర్మాణదారులకు పలు సూచనలు చేశారు. అనంతరం కొడంగల్‌లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన దసరా సమ్మేళన కార్యక్రమంలో తనను కలిసేందుకు వచ్చిన పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలను ఆత్మీయంగా పలకరించారు. సుమారు రెండు గంటలపాటు ఈ కార్యక్రమం కొనసాగింది. సీఎంను కలిసేందుకు నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో తరలివచ్చారు.

Updated at - Oct 23 , 2026 | 01:47 PM