తెలంగాణలో నితిన్ నబీన్ తొలి పర్యటన
ABN, Publish Date - Feb 05 , 2026 | 08:07 AM
బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ బుధవారం తెలంగాణలో పర్యటించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా ఆయన పర్యటించారు. ఈ క్రమంలో తెలంగాణలోని హైదరాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. నితిన్ నబీన్‌కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఘన స్వాగతం పలికారు.
1/13
బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ బుధవారం తెలంగాణలో పర్యటించారు.
2/13
తెలంగాణలోని హైదరాబాద్ విమానాశ్రయానికి నితిన్ నబీన్ చేరుకున్నారు. ఆయనకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఘన స్వాగతం పలికారు.
3/13
బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత తెలంగాణలో తొలిసారిగా పర్యటించారు.
4/13
అనంతరం మహబూబ్‌నగర్‌లో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో నితిన్ నబీన్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డిలు పాల్గొన్నారు.
5/13
బీజేపీ అభ్యర్థుల తరఫున నితిన్ నబీన్ ప్రచారం నిర్వహించారు. బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని నితిన్ నబీన్ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో బహిరంగ ర్యాలీలో ఆయన ప్రసంగించి పార్టీ కార్యకర్తలతో సంభాషించారు.
6/13
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పాలమూరు కేంద్రంగా జరిగిన విజయ సంకల్ప సమ్మేళనం బహిరంగ సభలో పాల్గొన్నానని నితిన్ నబిన్ తెలిపారు.
7/13
బీజేపీ అభ్యర్థులను మున్సిపల్ ఎన్నికల్లో గెలిపించాలని నితిన్ నబీన్ కోరారు. బీజేపీ శ్రేణులు కష్టపడి అభ్యర్థుల విజయం కోసం పనిచేయాలని నితిన్ నబీన్ దిశానిర్దేశం చేశారు.
8/13
అనంతరం కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రసంగించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. యువత, రైతులు, నిరుద్యోగులు, ఉద్యోగులను మోసం చేస్తోందని విమర్శించారు.
9/13
బీఆర్ఎస్, కాంగ్రెస్ తోడు దొంగల్లా మారి రాష్ట్రాన్ని దోచుకుంటున్నాయని కిషన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
10/13
కేసీఆర్ అవినీతిపై చర్యలు తీసుకోకపోవడం, ఫోన్ ట్యాపింగ్ కేసును సాగదీయడం వంటి చర్యల ద్వారా బీఆర్ఎస్ అవినీతికి కాంగ్రెస్ వత్తాసు పలుకుతుందని కిషన్ రెడ్డి ఆక్షేపించారు.
11/13
తెలంగాణలో పట్టణాభివృద్ధికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
12/13
తెలంగాణ అభివృద్ధి చెందాలంటే, అవినీతి రహిత పాలన దిశగా సాగాలంటే రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని కిషన్‌రెడ్డి ఉద్ఘాటించారు.
13/13
కేంద్ర బడ్జెట్ 2026-27లో పాలమూరు మీదుగా హైస్పీడ్ ఎలివేటెడ్ కారిడార్ రానుండటంతో పాలమూరు మరింత అభివృద్ధి చెందనుందని కిషన్ రెడ్డి వివరించారు.
Updated at - Feb 05 , 2026 | 03:45 PM