'అప్నాపన్‌-మై ఎక్స్‌పీరియన్స్ విత్ మోదీ' పుస్తకావిష్కరణ.. హాజరైన ప్రముఖులు

ABN, Publish Date - May 27 , 2026 | 07:03 AM

ఢిల్లీ వేదికగా కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ రచించిన ‘అప్నాపన్‌-మై ఎక్స్‌పీరియన్స్ విత్ మోదీ’ పుస్తకావిష్కరణ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ప్రధాని దేవగౌడ, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్య అతిథులుగా పాల్గొని పుస్తకాన్ని ఆవిష్కరించారు. అలాగే ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖాగుప్తా, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి, ఏపీ మంత్రి నారా లోకేశ్‌తో పాటు పలువురు కేంద్రమంత్రులు, ఎన్డీఏ కూటమి ఎంపీలు, నేతలు ఈ వేడుకకు హాజరయ్యారు. దేశ రాజకీయాల్లో ప్రముఖ నేతల సమక్షంలో జరిగిన ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

'అప్నాపన్‌-మై ఎక్స్‌పీరియన్స్ విత్ మోదీ' పుస్తకావిష్కరణ.. హాజరైన ప్రముఖులు 1/19

ఢిల్లీ వేదికగా కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ రచించిన ‘అప్నాపన్‌-మై ఎక్స్‌పీరియన్స్ విత్ మోదీ’ పుస్తకావిష్కరణ ఘనంగా జరిగింది.

'అప్నాపన్‌-మై ఎక్స్‌పీరియన్స్ విత్ మోదీ' పుస్తకావిష్కరణ.. హాజరైన ప్రముఖులు 2/19

ఈ కార్యక్రమంలో మాజీ ప్రధాని దేవగౌడ, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్య అతిథులుగా పాల్గొని పుస్తకాన్ని ఆవిష్కరించారు. అలాగే ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖాగుప్తా, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి, ఏపీ మంత్రి నారా లోకేశ్‌తో పాటు పలువురు కేంద్రమంత్రులు, ఎన్డీఏ కూటమి ఎంపీలు, నేతలు వేడుకకు హాజరయ్యారు. దేశ రాజకీయాల్లో ప్రముఖ నేతల సమక్షంలో జరిగిన ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

'అప్నాపన్‌-మై ఎక్స్‌పీరియన్స్ విత్ మోదీ' పుస్తకావిష్కరణ.. హాజరైన ప్రముఖులు 3/19

‘అప్నాపన్‌-మై ఎక్స్‌పీరియన్స్ విత్ మోదీ’ పుస్తకం ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వ శైలి, వ్యక్తిత్వం, దేశాభివృద్ధిపై ఆయన దృష్టికోణం వంటి అంశాలను రచయిత శివరాజ్‌సింగ్ చౌహాన్ తన అనుభవాల ద్వారా వివరించారు.

'అప్నాపన్‌-మై ఎక్స్‌పీరియన్స్ విత్ మోదీ' పుస్తకావిష్కరణ.. హాజరైన ప్రముఖులు 4/19

మాజీ ప్రధాని దేవగౌడ కూడా మోదీ నాయకత్వంపై తన అభిప్రాయాలను వెల్లడించారు. దేశ రాజకీయాల్లో మోదీ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారని వ్యాఖ్యానించారు. రాజకీయ అనుభవాలను పుస్తక రూపంలో అందించడం ప్రజలకు ఉపయోగకరమని కొనియాడారు.

'అప్నాపన్‌-మై ఎక్స్‌పీరియన్స్ విత్ మోదీ' పుస్తకావిష్కరణ.. హాజరైన ప్రముఖులు 5/19

తాను రచించిన అప్నాపన్ పుస్తకాన్ని దేశానికి అంకితం చేస్తున్నానని శివరాజ్ సింగ్ తెలిపారు.

'అప్నాపన్‌-మై ఎక్స్‌పీరియన్స్ విత్ మోదీ' పుస్తకావిష్కరణ.. హాజరైన ప్రముఖులు 6/19

మోదీతో తనకు ఉన్న సాన్నిహిత్యం, రాజకీయ ప్రయాణంలో ఎదుర్కొన్న అనుభవాలు, దేశ సేవలో ఆయన చూపిన చొరవ గురించి ఈ రచనలో ప్రస్తావించినట్లు శివరాజ్‌సింగ్ చౌహాన్ పేర్కొన్నారు.

'అప్నాపన్‌-మై ఎక్స్‌పీరియన్స్ విత్ మోదీ' పుస్తకావిష్కరణ.. హాజరైన ప్రముఖులు 7/19

ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడారు. శివరాజ్‌సింగ్ చౌహాన్ రచనలో ఉన్న ఆత్మీయత పాఠకులను ఆకట్టుకుంటుందని తెలిపారు. దేశ రాజకీయాల్లో ప్రధాని మోదీ చూపిన దిశానిర్దేశం, పరిపాలనా తీరు భవిష్యత్తు తరాలకు ఆదర్శంగా నిలుస్తాయని వ్యాఖ్యానించారు.

'అప్నాపన్‌-మై ఎక్స్‌పీరియన్స్ విత్ మోదీ' పుస్తకావిష్కరణ.. హాజరైన ప్రముఖులు 8/19

దేశంలో ప్రముఖ ముఖ్యమంత్రిగా శివరాజ్ సింగ్ పేరు తెచ్చుకున్నారని వెంకయ్యనాయుడు ప్రశంసించారు.

'అప్నాపన్‌-మై ఎక్స్‌పీరియన్స్ విత్ మోదీ' పుస్తకావిష్కరణ.. హాజరైన ప్రముఖులు 9/19

రైతు కుటుంబం నుంచి శివరాజ్ సింగ్ చౌహాన్ వచ్చారని.. 17 ఏళ్ల పాటు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారని వెంకయ్యనాయుడు తెలిపారు.

'అప్నాపన్‌-మై ఎక్స్‌పీరియన్స్ విత్ మోదీ' పుస్తకావిష్కరణ.. హాజరైన ప్రముఖులు 10/19

ఉచిత పథకాలకు తాను వ్యతిరేకమని.. రాష్ట్రాలు తమ ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకోవాలని వెంకయ్యనాయుడు సూచించారు. ప్రజలకు విద్య, ఆరోగ్యం అందించాలని.. మోదీ అంటే 'మేకింగ్ ఆఫ్ ఇండియా డెవలప్‌మెంట్' అని వెంకయ్య నాయుడు పేర్కొన్నారు.

'అప్నాపన్‌-మై ఎక్స్‌పీరియన్స్ విత్ మోదీ' పుస్తకావిష్కరణ.. హాజరైన ప్రముఖులు 11/19

‘అప్నాపన్‌-మై ఎక్స్‌పీరియన్స్ విత్ మోదీ’ పుస్తకం ద్వారా ప్రధాని మోదీ వ్యక్తిత్వం, నాయకత్వం, ప్రజలతో ఆయనకు ఉన్న అనుబంధం గురించి మరింత సమగ్రంగా పాఠకులకు తెలుస్తుందని సభకు వచ్చిన ప్రముఖులు వ్యాఖ్యానించారు.

'అప్నాపన్‌-మై ఎక్స్‌పీరియన్స్ విత్ మోదీ' పుస్తకావిష్కరణ.. హాజరైన ప్రముఖులు 12/19

ఢిల్లీలో జరిగిన ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది. దేశ రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తున్న ప్రముఖ నాయకులు ఒకే వేదికపై కనిపించడం విశేషంగా ఆకట్టుకుంది.

'అప్నాపన్‌-మై ఎక్స్‌పీరియన్స్ విత్ మోదీ' పుస్తకావిష్కరణ.. హాజరైన ప్రముఖులు 13/19

ఈ పుస్తకం కేవలం రాజకీయ విశ్లేషణ మాత్రమే కాకుండా, మోదీ వ్యక్తిత్వంలోని మానవీయ కోణాలను కూడా ఆవిష్కరించిందని పలువురు నేతలు అభిప్రాయపడ్డారు.

'అప్నాపన్‌-మై ఎక్స్‌పీరియన్స్ విత్ మోదీ' పుస్తకావిష్కరణ.. హాజరైన ప్రముఖులు 14/19

ప్రధాని మోదీపై వచ్చిన పుస్తకాల్లో ఇది ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకునే అవకాశం ఉందని ప్రముఖులు అభిప్రాయపడ్డారు.

'అప్నాపన్‌-మై ఎక్స్‌పీరియన్స్ విత్ మోదీ' పుస్తకావిష్కరణ.. హాజరైన ప్రముఖులు 15/19

ఈ కార్యక్రమానికి హాజరైన పలువురు కేంద్రమంత్రులు కూడా పుస్తకాన్ని అభినందిస్తూ రచయితను ప్రశంసించారు.

'అప్నాపన్‌-మై ఎక్స్‌పీరియన్స్ విత్ మోదీ' పుస్తకావిష్కరణ.. హాజరైన ప్రముఖులు 16/19

దేవగౌడను అప్యాయంగా పలుకరిస్తున్న మంత్రి నారా లోకేశ్, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు.

'అప్నాపన్‌-మై ఎక్స్‌పీరియన్స్ విత్ మోదీ' పుస్తకావిష్కరణ.. హాజరైన ప్రముఖులు 17/19

అనంతరం ఏపీ మంత్రి నారా లోకేశ్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడం గౌరవంగా భావిస్తున్నానని పేర్కొన్నారు.

'అప్నాపన్‌-మై ఎక్స్‌పీరియన్స్ విత్ మోదీ' పుస్తకావిష్కరణ.. హాజరైన ప్రముఖులు 18/19

మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తోందని లోకేశ్ వ్యాఖ్యానించారు.

'అప్నాపన్‌-మై ఎక్స్‌పీరియన్స్ విత్ మోదీ' పుస్తకావిష్కరణ.. హాజరైన ప్రముఖులు 19/19

శివరాజ్‌సింగ్ చౌహాన్ రచించిన ఈ పుస్తకం మోదీ వ్యక్తిత్వాన్ని పరిచయం చేస్తుందని, యువతకు ప్రేరణనిచ్చే అంశాలు ఇందులో ఉన్నాయని లోకేశ్ అభిప్రాయపడ్డారు.

Updated at - May 27 , 2026 | 07:50 AM