యాదాద్రిలో భక్తులతో నిండిపోయిన క్యూలైన్లు..
ABN, Publish Date - Jun 07 , 2026 | 06:15 PM
యాదాద్రిలో కొలువుదీరిన శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని దర్శనానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. ఆదివారంతోపాటు వేసవి సెలవులు మరికొన్ని రోజుల్లో ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో స్వామి వారిని ఈ రోజు అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు.
1/8
యాదాద్రిలో కొలువుదీరిన శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని దర్శనానికి ఆదివారం (07-06-2026) భక్తులు పోటెత్తారు.
2/8
ఈ రోజు ఆదివారం కావడంతోపాటు వేసవి సెలవులు మరికొన్ని రోజుల్లో ముగియనున్నాయి.
3/8
ఈ నేపథ్యంలో స్వామి వారిని ఈ రోజు అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు.
4/8
స్వామి వారి దర్శనం కోసం తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు యాదాద్రికి భారీగా తరలి వచ్చారు.
5/8
దీంతో క్యూ లైన్లతోపాటు ఆలయం పరిసర ప్రాంతాల్లో భక్తులు కిక్కిరిసిపోయారు.
6/8
భక్తుల రద్దీతో స్వామి వారి దర్శనానికి చాలా సమయం పట్టింది. పార్కింగ్ ప్రాంతాలన్నీ వాహనాలతో నిండిపోయాయి.
7/8
ఒక వైపు ఎండ వేడి అధికంగా ఉంది. దీంతో క్యూ లైన్‌లో నిలిచిన పిల్లా పాపలతో తరలి వచ్చిన భక్తులు కొంత ఇబ్బంది పడ్డారు.
8/8
బస్టాండ్ నుంచి ఆలయ పరిసర ప్రాంతాలకు ఆర్టీసీ బస్సులు.. సరిగ్గా లేకపోవడం.. సరైన సమయానికి రాకపోవడంతో భక్తులు కొంత ఇబ్బంది ఎదుర్కొన్నారు.
Updated at - Jun 07 , 2026 | 06:32 PM