తిరుమలలో ముగిసిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు

ABN, Publish Date - Oct 20 , 2026 | 06:02 PM

తిరుమలలోని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు మంగళవారం అంగరంగా వైభవంగా ముగిశాయి. ఎనిమిది రోజుల పాటు వివిధ వాహనసేవలపై శ్రీదేవి భూదేవి సమేతంగా తిరువీధుల్లో మలయప్పస్వామి ఊరేగారు.

తిరుమలలో ముగిసిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు 1/8

తిరుమలలోని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు మంగళవారం అంగరంగా వైభవంగా ముగిశాయి.

తిరుమలలో ముగిసిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు 2/8

ఎనిమిది రోజుల పాటు వివిధ వాహనసేవలపై శ్రీదేవి భూదేవి సమేతంగా తిరువీధుల్లో మలయప్పస్వామి ఊరేగారు.

తిరుమలలో ముగిసిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు 3/8

ఈ రోజు శ్రీవారి పుష్కరిణిలో ఉత్సవవర్లు, చక్రత్తాళ్వారుకు అర్చకులు అభిషేకాలు చేసి పుష్కరిణీ స్నానం చేయించారు.

తిరుమలలో ముగిసిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు 4/8

అనంతరం భక్తులకు స్నానాలను ఆచరించేందుకు అనుమతించారు.

తిరుమలలో ముగిసిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు 5/8

శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని సామాన్య భక్తులకు టీటీడీ పెద్దపీట వేసింది.

తిరుమలలో ముగిసిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు 6/8

అన్ని రకాల ప్రత్యేక దర్శనాలు, వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేయడంతో భక్తులు మూలవిరాట్టు దర్శనంతోపాటు వాహనసేవలను దర్శించుకున్నారు.

తిరుమలలో ముగిసిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు 7/8

ఈ ఎనిమిది రోజులలో 6.47 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు.

తిరుమలలో ముగిసిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు 8/8

హుండీ ద్వారా రూ.25.8 కోట్ల ఆదాయం వచ్చింది. 2.44 లక్షల మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించారు.

Updated at - Oct 20 , 2026 | 06:24 PM