సీఎం చంద్రబాబు సమక్షంలో శ్రీవారికి 121 కేజీల బంగారు ఆభరణాలను సమర్పించిన వర్థమాన్ జైన్ దంపతులు

ABN, Publish Date - Nov 26 , 2026 | 03:58 PM

తిరుమల వేంకటేశ్వరస్వామికి చెన్నైకి చెందిన దాత వర్థమాన్ జైన్ 121 కేజీల బంగారు ఆభరణాలను సమర్పించిన విషయం తెలిసిందే. ఈరోజు (గురువారం) ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో శ్రీవారికి వర్థమాన్ జైన్ దంపతులు బంగారు ఆభరణాలను అందించారు. దాదాపు రూ.207.6 కోట్ల విలువైన 121 కేజీల స్వర్ణ ఆభరణాలను శ్రీవారికి సమర్పించారు.

సీఎం చంద్రబాబు సమక్షంలో శ్రీవారికి 121 కేజీల బంగారు ఆభరణాలను సమర్పించిన వర్థమాన్ జైన్ దంపతులు 1/12

తిరుమల వేంకటేశ్వరస్వామికి చెన్నైకి చెందిన దాత వర్థమాన్ జైన్ 121 కేజీల బంగారు ఆభరణాలను సమర్పించిన విషయం తెలిసిందే.

సీఎం చంద్రబాబు సమక్షంలో శ్రీవారికి 121 కేజీల బంగారు ఆభరణాలను సమర్పించిన వర్థమాన్ జైన్ దంపతులు 2/12

ఈరోజు (గురువారం) ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో శ్రీవారికి వర్థమాన్ జైన్ దంపతులు బంగారు ఆభరణాలను అందించారు.

సీఎం చంద్రబాబు సమక్షంలో శ్రీవారికి 121 కేజీల బంగారు ఆభరణాలను సమర్పించిన వర్థమాన్ జైన్ దంపతులు 3/12

పల్లవ, చోళ, పాండ్యా రాజులు తిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని అభివృద్ధి చేశారని వివరించారు. మైసూర్, మరాఠా రాజులు అనేక ఆభరణాలు, కానుకలు, ఆస్తులను శ్రీనివాసుడికి ఇచ్చారని ప్రస్తావించారు.

సీఎం చంద్రబాబు సమక్షంలో శ్రీవారికి 121 కేజీల బంగారు ఆభరణాలను సమర్పించిన వర్థమాన్ జైన్ దంపతులు 4/12

దాదాపు రూ.207.6 కోట్ల విలువైన 121 కేజీల స్వర్ణ ఆభరణాలను శ్రీవారికి సమర్పించారు.

సీఎం చంద్రబాబు సమక్షంలో శ్రీవారికి 121 కేజీల బంగారు ఆభరణాలను సమర్పించిన వర్థమాన్ జైన్ దంపతులు 5/12

. శ్రీవారి కోసం 46 రకాల వేర్వేరు బంగారు ఆభరణాలను తయారు చేయించి కానుకగా అందించారు.

సీఎం చంద్రబాబు సమక్షంలో శ్రీవారికి 121 కేజీల బంగారు ఆభరణాలను సమర్పించిన వర్థమాన్ జైన్ దంపతులు 6/12

శ్రీవారికి 106 కిలోల బంగారంతో ఆభరణాలు చేయించగా.. శ్రీ పద్మావతీ అమ్మవారికి 15 కేజీల బరువైన వస్త్రాన్ని వర్థమాన్ జైన్ దంపతులు కానుకగా సమర్పించారు.

సీఎం చంద్రబాబు సమక్షంలో శ్రీవారికి 121 కేజీల బంగారు ఆభరణాలను సమర్పించిన వర్థమాన్ జైన్ దంపతులు 7/12

తిరుమలేశునికి భారీ ఎత్తున విరాళం సమర్పించిన జైన్ దంపతులకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. తిరుమల లాంటి పవిత్ర క్షేత్రంలో అపూర్వఘట్టం ఇవాళ ఆవిష్కృతమైందని వ్యాఖ్యానించారు.

సీఎం చంద్రబాబు సమక్షంలో శ్రీవారికి 121 కేజీల బంగారు ఆభరణాలను సమర్పించిన వర్థమాన్ జైన్ దంపతులు 8/12

తిరుమలను దివ్యక్షేత్రంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. వేంకటేశ్వరస్వామి వైభవం మాటల్లో చెప్పలేమని పేర్కొన్నారు. తిరుమల అంటే భక్తి, విశ్వాసం, ఆధ్యాత్మిక ఆనందమని చెప్పుకొచ్చారు.

సీఎం చంద్రబాబు సమక్షంలో శ్రీవారికి 121 కేజీల బంగారు ఆభరణాలను సమర్పించిన వర్థమాన్ జైన్ దంపతులు 9/12

ప్రతిరోజూ స్వామివారిని 121 కిలోల బంగారు ఆభరణాలతో అలంకరిస్తారని సీఎం తెలిపారు. ఈ అపూర్వ ఘట్టంలో తాను భాగస్వామిని కావడం తన అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు.

సీఎం చంద్రబాబు సమక్షంలో శ్రీవారికి 121 కేజీల బంగారు ఆభరణాలను సమర్పించిన వర్థమాన్ జైన్ దంపతులు 10/12

బంగారు ఆభరణాలతో పాటు విలువైన వజ్రాలు కూడా ఇందులో ఉన్నాయని వివరించారు. మరెక్కడా దొరకనటువంటి దివ్యానూభుతి తిరుమల క్షేత్రంలోనే లభిస్తుందని వెల్లడించారు.

సీఎం చంద్రబాబు సమక్షంలో శ్రీవారికి 121 కేజీల బంగారు ఆభరణాలను సమర్పించిన వర్థమాన్ జైన్ దంపతులు 11/12

రూ.200 కోట్ల విలువైన ఆభరణాలను తిరుమలేశునికి విరాళంగా ఇవ్వడం అపూర్వమైన సంఘటన అని చెప్పుకొచ్చారు. స్వామివారిపై భక్తి, విశ్వాసాలతో జైన్ దంపతులు ఈ బంగారు ఆభరణాలను ఇవ్వడానికి ముందుకు వచ్చారని కొనియాడారు.

సీఎం చంద్రబాబు సమక్షంలో శ్రీవారికి 121 కేజీల బంగారు ఆభరణాలను సమర్పించిన వర్థమాన్ జైన్ దంపతులు 12/12

శ్రీవారిని మొక్కుకున్న భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో విలువైన కానుకలను సమర్పిస్తారని ముఖ్యమంత్రి వెల్లడించారు. అలనాడు శ్రీకృష్ణ దేవరాయల నుంచి ఇప్పుడు జైన్ దంపతుల వరకు స్వామివారిపై భక్తి, విశ్వాసం పెరుగుతూనే ఉన్నాయని తెలిపారు.

Updated at - Nov 26 , 2026 | 04:03 PM