అనకాపల్లి నూకాంబికా అమ్మవారిని దర్శించుకున్న హోం మంత్రి అనిత
ABN, Publish Date - Oct 04 , 2026 | 06:03 PM
అనకాపల్లి జిల్లాలోని నూకాంబికా అమ్మవారిని ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనిత ఆదివారం కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
1/7
అనకాపల్లి జిల్లాలోని నూకాంబికా అమ్మవారిని ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనిత ఆదివారం కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారు ప్రజలందరికి సుఖశాంతులు, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకున్నారు.
2/7
అలాగే, అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.
3/7
అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడం ఎంతో ఆధ్యాత్మికమైన అనుభూతిని కలిగించిందని అనిత పేర్కొన్నారు.
4/7
నూకాంబికా ఆలయానికి చేరుకున్న హోం మంత్రి అనితకు స్థానిక నాయకులు.. ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికారు.
5/7
ఈ సందర్భంగా ఆలయ అధికారులు హోం మంత్రి అనితకు నూకాంబికా అమ్మవారి చిత్రపటాన్ని బహూకరించారు.
6/7
ప్రత్యేక పూజల అనంతరం అర్చకులు వేద ఆశీర్వచనం అందించారు.
7/7
అమ్మవారి దర్శనం అనంతరం హోం మంత్రి అనిత అనకాపల్లిలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
Updated at - Oct 04 , 2026 | 06:18 PM