మహానాడుకి భూమి పూజ.. తరలి వచ్చిన నేతలు, పార్టీ కేడర్
ABN, Publish Date - May 06 , 2026 | 09:30 PM
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కోవూరు నియోజకవర్గ పరిధిలోని ఇఫ్కో కిసాన్ సెజ్‌లో టీడీపీ మహానాడు 2026 ను నిర్వహించనున్నారు. ఈ మహానాడు వేడుకకు బుధవారం (06-05-2026) భూమి పూజ నిర్వహించారు.
1/6
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కోవూరు నియోజకవర్గ పరిధిలోని ఇఫ్కో కిసాన్ సెజ్‌లో టీడీపీ మహానాడు 2026 ను నిర్వహించనున్నారు. ఈ మహానాడు వేడుకకు బుధవారం (06-05-2026) భూమి పూజ నిర్వహించారు.
2/6
ఈ కార్యక్రమంలో మంత్రులు పి. నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డితోపాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. మే 27 నుంచి 29వ తేదీ వరకు ఈ మహానాడు నిర్వహించనున్నారు.
3/6
నెల్లూరు జిల్లాలో తొలిసారి మహానాడు నిర్వహిస్తున్నామని మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణ తెలిపారు. ఇఫ్కో కిసాన్ సెజ్‌లో 2,200 ఎకరాల స్థలం ఉందని.. పార్కింగ్, ట్రాఫిక్ సమస్యలు ఉండవని ఆయన పేర్కొన్నారు.
4/6
మూడు రోజుల పాటు జరిగే మహానాడులో ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటారని వివరించారు. అందర్నీ సమన్వయం చేస్తూ, సమష్టి కృషితో మహానాడును విజయవంతం చేస్తామని మంత్రి పి. నారాయణ వెల్లడించారు. మహానాడు వేళ.. పార్టీ క్యాడర్‌లో నూతనోత్సాహం కనిపిస్తోందని తెలిపారు.
5/6
మూడు రోజుల పాటు రాష్ట్ర నేతలంతా ఈ జిల్లాలోనే ఉంటారని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. భవిష్యత్తు తరాలకు ఉపయోగపడేలా ఈ మహానాడు వేదికగా తీర్మానాలు ఉంటాయన్నారు.
6/6
మొదటి రెండు రోజులు 20 వేల మంది డెలిగేట్స్ వస్తారని.. మూడో రోజు బహిరంగ సభ ఉంటుందని ఆయన వెల్లడించారు. ఈ బహిరంగ సభకు దాదాపు ఏడు లక్షలకు పైగా కార్యకర్తలు తరలి వస్తారని అంచనా వేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
Updated at - May 06 , 2026 | 09:33 PM