ప్రధాని మోదీ జన్మదినం.. వారణాసిలో పర్యటించిన సీఎం చంద్రబాబు
ABN, Publish Date - Sep 17 , 2026 | 09:01 PM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో పర్యటించారు. ప్రధాని జన్మదినం సందర్భంగా వాద్ నగర్ సంకల్ప యాత్రలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, పలువురు కేంద్ర మంత్రులతో కలిసి సీఎం చంద్రబాబు పాల్గొన్నారు.
1/7
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో పర్యటించారు.
2/7
ప్రధాని జన్మదినం సందర్భంగా వాద్ నగర్ సంకల్ప యాత్రలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, పలువురు కేంద్ర మంత్రులతో కలిసి సీఎం చంద్రబాబు పాల్గొన్నారు.
3/7
ఈ సందర్భంగా ప్రధాని మోదీపై సీఎం చంద్రబాబు ప్రశంసల వర్షం కురిపించారు.
4/7
అంతకుముందు వారణాసిలో కొలుదీరిన శ్రీకాశీ విశ్వనాథ దేవాలయంలో వీరంతా ప్రత్యేక పూజలు నిర్వహించారు.
5/7
అనంతరం సీఎం చంద్రబాబు మాట్లాడారు. భారత్‌ను ప్రధాని మోదీ అభివృద్ధి దిశగా తీసుకెళ్తున్నారని అన్నారు.
6/7
ప్రధాని నిర్ణయాలతో 25 ఏళ్లలో భారత్ మరింత అభివృద్ధి చెందుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
7/7
ప్రధాని మోదీని చూసి దేశం గర్వపడుతోందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.
Updated at - Sep 17 , 2026 | 09:11 PM