గ్యాస్ సిలిండర్ కోసం తప్పని తిప్పలు
ABN, Publish Date - Mar 18 , 2026 | 01:35 PM
ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం జరుగుతుంది. దీంతో దేశవ్యాప్తంగా గ్యాస్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. తెలుగు రాష్ట్రాల్లో సైతం గ్యాస్ దొరకడం లేదు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్యాస్ సిలిండర్ల సరఫరాలో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు చేపట్టాయి. అయినా.. గ్యాస్ ఏజెన్సీల వద్ద సిలిండర్లతో భారీ క్యూ కనిపిస్తోంది.
1/9
ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం జరుగుతుంది. దీంతో దేశవ్యాప్తంగా గ్యాస్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. తెలుగు రాష్ట్రాల్లో సైతం గ్యాస్ దొరకడం లేదు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
2/9
గ్యాస్ సిలిండర్ల సరఫరాలో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు చేపట్టాయి. అయినా.. గ్యాస్ ఏజెన్సీల వద్ద సిలిండర్లతో భారీ క్యూ కనిపిస్తోంది.
3/9
గ్యాస్ సిలిండర్ బుక్ చేస్తే.. ఎప్పుటికి ఇంటికి వస్తుందో తెలియని పరిస్థితి ఏర్పడింది.
4/9
దీంతో వారే సిలిండర్ తీసుకుని గ్యాస్ ఏజెన్సీకి తరలి వెళ్తున్నారు. దీంతో గ్యాస్ ఏజెన్సీలు జనంతో నిండిపోయాయి.
5/9
గ్యాస్ కొరత నేపథ్యంలో ఒక్కో సిలిండర్‌పై కేంద్రం రూ.60 పెంచింది. దీనిపై సర్వత్రా నిరసన వ్యక్తమైంది. అయినా గ్యాస్ నిత్యవసర వస్తువుల్లో భాగమైపోయింది.
6/9
గ్యాస్ కోసం గుంటూరులోని ఒక గోడౌన్ వద్ద భారీగా బారులు తీరిన కస్టమర్లు..
7/9
అదీకాక గ్యాస్ లేకుంటే.. వంట లేదు. వంట లేకుంటే.. ఆఫీసుకు వెళ్లేదే లేదు. ఈ గ్యాస్ కొరత కారణంగా తెలుగు రాష్ట్రాల్లో చాలా హోటళ్లలు మూతపడ్డాయి.
8/9
ఒక వేళ హోటల్లు తెరిచిన కొన్ని ఆహార పదార్థాలను మాత్రమే తయారు చేస్తున్నారు. నూనెతో ముడిపడిన ఆహార పదార్థాలు.. అట్టు, పూరీ, మైసూర్ బొండా తయారీని పూర్తిగా నిలిపివేశారు.
9/9
గ్యాస్ ఉంటే.. ఆహారం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చనే భావనలో ప్రజలు ఉన్నారు. దీంతో గ్యాస్ సిలిండర్ కోసం ప్రజలు ఏజెన్సీలకు క్యూ కడుతున్నారు.
Updated at - Mar 18 , 2026 | 01:46 PM