తిరుపతి, కడపలో ఇంధన కొరత.. పెట్రోల్ బంకుల వద్ద భారీ క్యూలు

ABN, Publish Date - Apr 26 , 2026 | 01:18 PM

ఏపీలోని తిరుపతి, కడప నగరాల్లో పెట్రోల్, డీజిల్ కొరత ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. పరిస్థితి త్వరగా సాధారణ స్థితికి రావాలని ప్రజలు ఆశిస్తున్నారు. ఇలాంటి సందర్భాల్లో భయంతో అధికంగా నిల్వలు చేయకుండా, అవసరమైనంత మాత్రమే వినియోగించాలని అధికారులు సూచించారు.

తిరుపతి, కడపలో ఇంధన కొరత.. పెట్రోల్ బంకుల వద్ద భారీ క్యూలు 1/10

ఏపీలోని తిరుపతి, కడప నగరాల్లో పెట్రోల్, డీజిల్ కొరత ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. పరిస్థితి త్వరగా సాధారణ స్థితికి రావాలని ప్రజలు ఆశిస్తున్నారు.

తిరుపతి, కడపలో ఇంధన కొరత.. పెట్రోల్ బంకుల వద్ద భారీ క్యూలు 2/10

ఇలాంటి సందర్భాల్లో భయంతో అధికంగా నిల్వలు చేయకుండా, అవసరమైనంత మాత్రమే వినియోగించాలని అధికారులు సూచించారు.

తిరుపతి, కడపలో ఇంధన కొరత.. పెట్రోల్ బంకుల వద్ద భారీ క్యూలు 3/10

తిరుపతి, కడప నగరాల్లో డీజిల్, పెట్రోల్ కొరత పరిస్థితులు తీవ్ర ఆందోళనకు దారి తీస్తున్నాయి. ఇంధనం కోసం వాహనదారులు బంకుల వద్ద భారీగా క్యూ లైన్లలో నిలబడుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.

తిరుపతి, కడపలో ఇంధన కొరత.. పెట్రోల్ బంకుల వద్ద భారీ క్యూలు 4/10

తిరుపతి నగరంలో పలు పెట్రోల్ బంకుల వద్ద వాహనాలు కిలోమీటర్ల మేర బారులు తీరాయి. ఉదయం నుంచే బంకుల వద్ద రద్దీ పెరిగి, గంటల పాటు వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.

తిరుపతి, కడపలో ఇంధన కొరత.. పెట్రోల్ బంకుల వద్ద భారీ క్యూలు 5/10

కొంతమంది పెద్ద క్యాన్లతో వచ్చి డీజిల్, పెట్రోల్ నిల్వ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కడప నగరంలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది.

తిరుపతి, కడపలో ఇంధన కొరత.. పెట్రోల్ బంకుల వద్ద భారీ క్యూలు 6/10

పెట్రోల్ బంకుల వద్ద భారీ రద్దీ కనిపిస్తుండగా, కొన్నిచోట్ల స్టాక్ అయిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.

తిరుపతి, కడపలో ఇంధన కొరత.. పెట్రోల్ బంకుల వద్ద భారీ క్యూలు 7/10

రైతులు, ట్రాన్స్‌పోర్ట్ వాహనదారులు ముఖ్యంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గంటల తరబడి క్యూ లో నిలబడాల్సిన పరిస్థితి నెలకొంది.

తిరుపతి, కడపలో ఇంధన కొరత.. పెట్రోల్ బంకుల వద్ద భారీ క్యూలు 8/10

అత్యవసర ప్రయాణాలు చేసేవారు కూడా ఇంధనం అందక ఇబ్బంది పడుతున్నారు. ధరలు పెరుగుతాయనే భయంతో నిల్వలు చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.

తిరుపతి, కడపలో ఇంధన కొరత.. పెట్రోల్ బంకుల వద్ద భారీ క్యూలు 9/10

ట్రాన్స్‌పోర్ట్, వ్యవసాయ రంగాలపై కూడా తీవ్ర ప్రభావం పడింది. సరఫరాలో అంతరాయం , ఇంధనం డిమాండ్ అకస్మాత్తుగా పెరగడం, రవాణా సమస్యలు వంటి అంశాలు కారణమై ఉండవచ్చని ప్రజలు భావిస్తున్నారు.

తిరుపతి, కడపలో ఇంధన కొరత.. పెట్రోల్ బంకుల వద్ద భారీ క్యూలు 10/10

ఈ పరిస్థితిపై అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఇంధన సరఫరా సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవడం, బంకుల వద్ద నియంత్రణ ఏర్పాటు చేయడం అత్యవసమని ప్రజలు తెలిపారు.

Updated at - Apr 26 , 2026 | 01:22 PM