అమరావతిలో క్వాంటమ్ వ్యాలీకి శంకుస్థాపన
ABN, Publish Date - Feb 08 , 2026 | 07:07 AM
అమరావతిలోని ఉద్దండరాయునిపాలెంలో క్వాంటమ్ వ్యాలీకి శనివారం శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి జితేంద్రసింగ్, సీఎం చంద్రబాబు, పెమ్మసాని చంద్రశేఖర్, ఏపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, కూటమి నేతలు హాజరయ్యారు. క్వాంటమ్ వ్యాలీ కోసం 50 ఎకరాలని కూటమి ప్రభుత్వం కేటాయించింది.
1/20
అమరావతిలోని ఉద్దండరాయునిపాలెంలో క్వాంటమ్ వ్యాలీకి శనివారం శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రులు జితేంద్రసింగ్, పెమ్మసాని చంద్రశేఖర్, ఏపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, కూటమి నేతలు హాజరయ్యారు.
2/20
క్వాంటమ్ వ్యాలీలో ఐబీఎం, టీసీఎస్, ఎల్ అండ్ టీ కీలకంగా మారనున్నాయి.
3/20
అమరావతికి దేశంలోనే మొదటి 133 క్యూబిట్ క్వాంటమ్ కంప్యూటర్‌గా పేరుంది.
4/20
క్వాంటమ్ కంప్యూటింగ్, క్వాంటమ్ కమ్యూనికేషన్స్ రంగాలతో పాటు క్వాంటమ్ సెన్సార్స్, ఏఐ రంగాల్లో పరిశోధనలు జరగనున్నాయి.
5/20
క్వాంటమ్ వ్యాలీని రెండు వరుసల్లో 8 భారీ టవర్ల నిర్మాణంతో చేపడుతున్నారు.
6/20
రూ.7,800 కోట్ల పెట్టుబడులతో 50 ఎకరాల్లో క్యాంటమ్ వ్వాలీ ఏర్పాటు కానుంది.
7/20
మొత్తం 8.5 మిలియన్ చదరపు అడుగుల నిర్మాణంతో క్వాంటమ్ వ్యాలీని ఏపీ ప్రభుత్వం పూర్తి చేయనుంది. దీంతో పాటు రెండెకరాల్లో జీ ప్లస్ వన్ క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ భవనాన్ని ఏపీ సర్కార్ ఏర్పాటు చేయనుంది.
8/20
48 అంతస్తుల నుంచి 29 అంతస్తుల్లో ఎత్తైన టవర్ల నిర్మాణాన్ని ఏపీ ప్రభుత్వం చేపట్టనుంది.
9/20
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ప్రసంగించారు. మరో 35, 40 ఏళ్ల పాటు యువత భవితను తీర్చిదిద్దేలా సాంకేతిక రంగం వైపు అడుగులు వేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.
10/20
చరిత్రను సృష్టించాలన్నా, తిరగ రాయాలన్నా అది విద్యార్థులకే సాధ్యమని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు.
11/20
క్వాంటమ్ కంప్యూటింగ్ మొత్తం దేశానికే గేమ్ చేంజర్ కానుందని సీఎం చంద్రబాబు తెలిపారు.
12/20
రాష్ట్రంలోని ప్రతి ఒక్క ఇంజనీరింగ్, మెడిసిన్ విద్యార్థి కృత్రిమ మేధ (ఏఐ) , క్వాంటమ్ కంప్యూటింగ్‌లో నైపుణ్యం సాధించాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు.
13/20
ఈ నెల 16వ తేదీన బిల్‌గేట్స్ ఏపీకి వస్తున్నారని సీఎం చంద్రబాబు తెలిపారు.
14/20
అమరావతిలో ఈరోజు ‘క్వాంటమ్ వ్యాలీ భవనాలకు మాత్రమే తాను పునాది వేయడం లేదని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు.
15/20
కేంద్ర బడ్జెట్‌లో అమరావతికి భారీగా నిధులు కేటాయించామని కేంద్రమంత్రి జితేంద్రసింగ్ తెలిపారు.
16/20
మరే రాష్ట్ర రాజధానికి ఇటువంటి ప్రత్యేక నిధులు లభించలేదని జితేంద్రసింగ్ వివరించారు.
17/20
పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేసేందుకు కేంద్ర బడ్జెట్‌లో ప్రత్యేక హామీ ఇచ్చామని జితేంద్రసింగ్ పేర్కొన్నారు.
18/20
ఆగస్టు నాటికి క్వాంటమ్ వ్యాలీ భవనం సిద్ధమయ్యేలా ప్రణాళికలు రచించారని జితేంద్రసింగ్ వివరించారు.
19/20
కూటమి ప్రభుత్వం అమరావతిని అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తోందని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు.
20/20
ఏపీ స్టార్టప్ స్టేట్ అని... అందుకే అభివృద్ధికి తమ ప్రభుత్వం బాటలు వేస్తోందని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ప్రపంచంలో టాప్-3 క్వాంటమ్ వ్యాలీల్లో అమరావతిని ప్లేస్ చేయాలనేది తమ లక్ష్యమని లోకేశ్ పేర్కొన్నారు.
Updated at - Feb 08 , 2026 | 07:15 AM