ఏపీ స్థానిక ఎన్నికలకు సర్వం సిద్ధం

ABN, Publish Date - Oct 31 , 2026 | 06:56 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపు (ఆదివారం) జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎన్నికల నిర్వహణకు సంబంధించి అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేపట్టారు. పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా ఎన్నికల యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది.

ఏపీ స్థానిక ఎన్నికలకు సర్వం సిద్ధం 1/16

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపు (ఆదివారం) జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.

ఏపీ స్థానిక ఎన్నికలకు సర్వం సిద్ధం 2/16

ఎన్నికల నిర్వహణకు సంబంధించి అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేపట్టారు.

ఏపీ స్థానిక ఎన్నికలకు సర్వం సిద్ధం 3/16

పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా ఎన్నికల యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది.

ఏపీ స్థానిక ఎన్నికలకు సర్వం సిద్ధం 4/16

ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ వర్గాలు, అభ్యర్థులు, ఓటర్లలో ఆసక్తి నెలకొంది.

ఏపీ స్థానిక ఎన్నికలకు సర్వం సిద్ధం 5/16

తొలిదశలో 100 పట్టణ స్థానిక సంస్థలకు (13 నగరపాలక సంస్థలు, 87 పురపాలక సంస్థలు/నగర పంచాయతీలు) ఎన్నికలు జరుగనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 17 మున్సిపల్ ఛైర్మన్ పదవులు ఏకగ్రీవమయ్యాయి.

ఏపీ స్థానిక ఎన్నికలకు సర్వం సిద్ధం 6/16

ఎన్నికల పోలింగ్‌ల్లో ఓటు వేసేందుకు ఎలక్షన్ కమిషన్ సూచించిన 22 రకాల గుర్తింపు కార్డుల్లో ఏది చూపించినా అనుమతి ఉంటుందని వివరించారు. ఓటర్ స్లిప్పులు లేకపోయినా గుర్తింపు కార్డుతో నిర్భయంగా ఓటు వేయొచ్చని అధికారులు సూచించారు.

ఏపీ స్థానిక ఎన్నికలకు సర్వం సిద్ధం 7/16

ఆదివారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ నిర్వహించనున్నారు.

ఏపీ స్థానిక ఎన్నికలకు సర్వం సిద్ధం 8/16

ఈ ఎన్నికల్లో అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

ఏపీ స్థానిక ఎన్నికలకు సర్వం సిద్ధం 9/16

ఎన్నికల విధుల కోసం వేలాది మంది సిబ్బందిని నియమించారు. పోలింగ్ కేంద్రాలకు బ్యాలెట్ బాక్సులు, ఇతర ఎన్నికల సామగ్రిని తరలించే ప్రక్రియ ప్రారంభమైంది.

ఏపీ స్థానిక ఎన్నికలకు సర్వం సిద్ధం 10/16

ఓటర్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అధికారులు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు.

ఏపీ స్థానిక ఎన్నికలకు సర్వం సిద్ధం 11/16

ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టారు.

ఏపీ స్థానిక ఎన్నికలకు సర్వం సిద్ధం 12/16

ఎన్నికల కోసం ఏపీవ్యాప్తంగా భారీగా పోలీసు సిబ్బందిని విధుల్లో నియమించారు.

ఏపీ స్థానిక ఎన్నికలకు సర్వం సిద్ధం 13/16

సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద అదనపు బలగాలను మోహరించారు.

ఏపీ స్థానిక ఎన్నికలకు సర్వం సిద్ధం 14/16

సీసీటీవీ కెమెరాలు, డ్రోన్లు, వెబ్‌కాస్టింగ్ ద్వారా పరిస్థితిని ఎస్ఈసీ నిరంతరం పర్యవేక్షించనుంది.

ఏపీ స్థానిక ఎన్నికలకు సర్వం సిద్ధం 15/16

మొత్తంగా ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది.

ఏపీ స్థానిక ఎన్నికలకు సర్వం సిద్ధం 16/16

ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టింది.

Updated at - Oct 31 , 2026 | 08:39 PM