ఆర్నబ్ తుఫాన్ ప్రభావం.. ఏపీలో భారీ వర్షాలు
ABN, Publish Date - Oct 27 , 2026 | 04:26 PM
ఆంధ్రప్రదేశ్లో ఆర్నబ్ తుఫాన్ ప్రభావంతో విశాఖపట్నంతో పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. పలు ప్రాంతాల్లో రహదారులపైకి వరద చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
1/11
ఆంధ్రప్రదేశ్లో ఆర్నబ్ తుఫాన్ ప్రభావంతో విశాఖపట్నంతో పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తంగా మారింది.
2/11
మరోవైపు సముద్రం అల్లకల్లోలంగా మారడంతో తీర ప్రాంతాల్లో పరిస్థితులపై ఆందోళన నెలకొంది. పలు ప్రాంతాల్లో రహదారులపైకి వరద చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
3/11
రాకపోకలకు అంతరాయం ఏర్పడటంతో వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఆర్నబ్ తుఫాన్ ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో వాతావరణ పరిస్థితులు ప్రతికూలంగా మారాయి.
4/11
భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రహదారులపై నీరు నిలిచిపోవడంతో సాధారణ రాకపోకలు నెమ్మదించాయి. వర్షాలు పడుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
5/11
తుఫాన్ ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. సముద్రంలో అలల ఉద్ధృతి పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో తీర ప్రాంత ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.
6/11
మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లే విషయంలో అధికారుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు. వాతావరణ పరిస్థితులను గమనిస్తూ అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు.
7/11
భారీ వర్షాలు, ఈదురుగాలుల కారణంగా విద్యుత్ తీగలు దెబ్బతినడం, విద్యుత్ స్తంభాలు పడిపోవడం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.
8/11
ఇలాంటి పరిస్థితుల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా, దెబ్బతిన్న విద్యుత్ తీగలు, స్తంభాలను పునరుద్ధరించేందుకు విద్యుత్ శాఖ సిబ్బంది, అవసరమైన వాహనాలను సిద్ధంగా ఉంచారని తెలిపారు. ఎక్కడైనా విద్యుత్ లైన్లు దెబ్బతిన్నట్లు గుర్తిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించి, మరమ్మతు పనులను వారికే వదిలేయాలని అధికారులు సూచించారు.
9/11
అత్యవసరమైతే తప్ప భారీ వర్షాలు కురుస్తున్న సమయంలో బయటకు వెళ్లవద్దని అధికారులు సూచించారు.
10/11
అత్యవసర పరిస్థితుల్లో సంబంధిత శాఖలకు సమాచారం అందించాలని అధికారులు సూచించారు.
11/11
ఆర్నబ్ తుఫాన్ ప్రభావంతో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అధికారుల సూచనలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు పేర్కొన్నారు.
Updated at - Oct 27 , 2026 | 07:10 PM