కుటుంబంతో కలిసి ఓటేసిన చంద్రబాబు.. ఓటుహక్కు వినియోగించుకోవాలంటూ పిలుపు

ABN, Publish Date - Nov 26 , 2026 | 11:53 AM

మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో సీఎం చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు. భువనేశ్వరి, లోకేశ్, బ్రహ్మణితో కలిసి ఉండవల్లి ఎంపీయూపీ స్కూల్‌లో ఓటుహక్కు వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరూ ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలని ఈ సందర్భంగా ప్రజలకు పిలుపునిచ్చారు.

కుటుంబంతో కలిసి ఓటేసిన చంద్రబాబు.. ఓటుహక్కు వినియోగించుకోవాలంటూ పిలుపు 1/6

మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో సీఎం చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు. భువనేశ్వరి, లోకేశ్, బ్రహ్మణితో కలిసి ఉండవల్లి ఎంపీయూపీ స్కూల్‌లో ఓటుహక్కు వినియోగించుకున్నారు.

కుటుంబంతో కలిసి ఓటేసిన చంద్రబాబు.. ఓటుహక్కు వినియోగించుకోవాలంటూ పిలుపు 2/6

రాష్ట్రంలో తొలివిడత పంచాయతీ ఎన్నికల పోలింగ్‌తో పాటూ 23 పట్టణ స్థానిక సంస్థలకు ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో మంగళగిరి- తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఓటు హక్కును వినియోగించుకున్నారు.

కుటుంబంతో కలిసి ఓటేసిన చంద్రబాబు.. ఓటుహక్కు వినియోగించుకోవాలంటూ పిలుపు 3/6

మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సతీసమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. గురువారం ఉదయం ఉండవల్లిలోని గాదె రామయ్య సీతారామమ్మ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు కుటుంబ సభ్యులతో కలిసి చేరుకున్న మంత్రి లోకేష్... 53వ డివిజన్ పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.

కుటుంబంతో కలిసి ఓటేసిన చంద్రబాబు.. ఓటుహక్కు వినియోగించుకోవాలంటూ పిలుపు 4/6

సీఎం చంద్రబాబు సతీమణి, హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ వైస్ చైర్‌పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్ నారా భువనేశ్వరి మున్సిపల్ ఎన్నికల్లో ఓటుహక్కును వినియోగించుకున్నారు.

కుటుంబంతో కలిసి ఓటేసిన చంద్రబాబు.. ఓటుహక్కు వినియోగించుకోవాలంటూ పిలుపు 5/6

ఎన్నికల కేంద్రానికి కుటుంబ సమేతంగా వచ్చిన సీఎం.. స్థానికులను ఆప్యాయంగా పలకరించారు. అందరూ తప్పకుండా ఓటుహక్కును వినియోగించుకోవాలని కోరారు.

కుటుంబంతో కలిసి ఓటేసిన చంద్రబాబు.. ఓటుహక్కు వినియోగించుకోవాలంటూ పిలుపు 6/6

పోలింగ్ కేంద్రం వద్ద సీఎం చంద్రబాబు, లోకేశ్‌లు చిన్నారులను ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని ఫొటోలు దిగారు.

Updated at - Nov 26 , 2026 | 11:55 AM