అమరావతిలో ఆర్టీజీఎస్ కేంద్రాన్ని సందర్శించిన బిల్‌గేట్స్

ABN, Publish Date - Feb 16 , 2026 | 04:43 PM

ఆర్టీజీఎస్ కేంద్రాన్ని గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్‌గేట్స్ సోమవారం అమరావతితో పర్యటించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో కలిసి సచివాలయంలో ఆర్టీజీఎస్ కేంద్రాన్ని బిల్‌గేట్స్ సందర్శించారు. ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి పాలనలో టెక్నాలజీ వినియోగాన్ని పరిశీలించారాయన.

అమరావతిలో ఆర్టీజీఎస్ కేంద్రాన్ని సందర్శించిన బిల్‌గేట్స్ 1/9

ఆర్టీజీఎస్ కేంద్రాన్ని గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్‌గేట్స్ సోమవారం అమరావతితో పర్యటించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో కలిసి సచివాలయంలో ఆర్టీజీఎస్ కేంద్రాన్ని బిల్‌గేట్స్ సందర్శించారు.

అమరావతిలో ఆర్టీజీఎస్ కేంద్రాన్ని సందర్శించిన బిల్‌గేట్స్ 2/9

ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి పాలనలో టెక్నాలజీ వినియోగాన్ని పరిశీలించారాయన. అనంతరం అమరావతి సెక్రటేరియట్‌లోని సమావేశ మందిరంలో సీఎం, మంత్రులు, సెక్రటరీలతో సమావేశంలో పలు అంశాలపై తన అభిప్రాయాలు పంచుకున్నారు బిల్‌గేట్స్. చంద్రబాబు తనకు గుడ్ ఓల్డ్ ఫ్రెండ్ అని సమావేశంలో సరదాగా వ్యాఖ్యానించారాయన.

అమరావతిలో ఆర్టీజీఎస్ కేంద్రాన్ని సందర్శించిన బిల్‌గేట్స్ 3/9

భారతదేశంలో ఇన్నోవేషన్స్, వేగవంతమైన నిర్ణయాలు, చర్యలు అద్భుతంగా ఉన్నాయని బిల్‌గేట్స్ అభిప్రాయపడ్డారు. డిజిటల్ విప్లవానికి భారతదేశంలో బలమైన పునాదులు పడ్డాయని బిల్‌గేట్స్ తెలిపారు.

అమరావతిలో ఆర్టీజీఎస్ కేంద్రాన్ని సందర్శించిన బిల్‌గేట్స్ 4/9

భారతదేశ డిజిటల్ విప్లవంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, సీఎం చంద్రబాబు కీలక పాత్ర పోషిస్తున్నారని కితాబిచ్చారు బిల్‌గేట్స్. తాను మొదటిసారి సీఎం చంద్రబాబును కలిసినప్పటి విషయాలను ఈ సమావేశంలో పంచుకున్నారాయన. ప్రపంచ దేశాల్లో తాను కలిసిన ఎంతో మంది నాయకుల ఆలోచనల కంటే చంద్రబాబు ఆలోచనలు చాలా ముందున్నాయని తొలి భేటీలోనే గ్రహించినట్లు వెల్లడించారు.

అమరావతిలో ఆర్టీజీఎస్ కేంద్రాన్ని సందర్శించిన బిల్‌గేట్స్ 5/9

నాటి సింగపూర్ ప్రధాని కూడా చంద్రబాబు తరహా భిన్నమైన, విజన్‌తో కూడిన ఆలోచనలు చేసేవారని సమావేశంలో వివరించారు బిల్‌గేట్స్.

అమరావతిలో ఆర్టీజీఎస్ కేంద్రాన్ని సందర్శించిన బిల్‌గేట్స్ 6/9

గేట్స్ ఫౌండేషన్ చేపడుతున్న కార్యక్రమాల్లో ఆరోగ్య రంగానికి చెందిన ప్రాజెక్టులే మెజార్టీ ప్రాజెక్టులని వివరించారాయన. ఆరోగ్య సేవలను ప్రజలకు మరింత చేరువ చేయాలని బిల్‌గేట్స్ సూచించారు.

అమరావతిలో ఆర్టీజీఎస్ కేంద్రాన్ని సందర్శించిన బిల్‌గేట్స్ 7/9

కుప్పంలో అమలు చేస్తున్న సంజీవని కార్యక్రమం అద్భుతంగా ఉందని సమావేశంలో మరోసారి కితాబిచ్చారు. విద్యార్థుల సమస్యలను అర్థం చేసుకోవడానికి, వారికి సరైన రీతిలో తగిన స్థాయిలో విద్యాబోధన చేయడానికి ఏఐ సహయపడుతుందని బిల్‌గేట్స్ వివరించారు.

అమరావతిలో ఆర్టీజీఎస్ కేంద్రాన్ని సందర్శించిన బిల్‌గేట్స్ 8/9

విద్యారంగంలో అద్భుతమైన మార్పులు తీసుకురావడానికి ఏఐ- టెక్నాలజీ ఉపయోగపడుతుందని చెప్పుకొచ్చారు. వ్యవసాయం రంగం చాలా ముఖ్యమైన రంగమని అభిప్రాయపడ్డారు బిల్ గేట్స్. ఈ రంగం ఎంత ముఖ్యమో ఇప్పటికీ చాలా మందికి తెలియదని బిల్‌గేట్స్ వ్యాఖ్యానించారు.

అమరావతిలో ఆర్టీజీఎస్ కేంద్రాన్ని సందర్శించిన బిల్‌గేట్స్ 9/9

టెక్నాలజీ సాయంతో ఏపీ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రయత్నించడాన్ని ప్రత్యేకంగా బిల్‌గేట్స్ ప్రస్తావించారు. టెక్నాలజీని రైతులకు అందించేందుకు... ఏఐను వ్యవసాయంతో ఇంటిగ్రేట్ చేసేందుకు ఏపీ కృషి చేస్తోందని బిల్‌గేట్స్ వెల్లడించారు.

Updated at - Feb 16 , 2026 | 04:43 PM