గోదావరి జలాలకు సాష్టాంగ నమస్కారం చేసిన సీఎం చంద్రబాబు

ABN, Publish Date - Sep 02 , 2026 | 07:00 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం అనకాపల్లి జిల్లాలోని పాయకరావుపేటలో పర్యటించారు. ఏరియల్ వ్యూ ద్వారా పోలవరం ఎడమ కాల్వను పరిశీలించి ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను విడుదల చేసి జలహారతి ఇచ్చారు. ముఖ్యమంత్రికి సంప్రదాయ కోలాటంతో స్వాగతం పలికారు.

 గోదావరి జలాలకు సాష్టాంగ నమస్కారం చేసిన సీఎం చంద్రబాబు 1/15

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం అనకాపల్లి జిల్లాలోని పాయకరావుపేటలో పర్యటించారు.

 గోదావరి జలాలకు సాష్టాంగ నమస్కారం చేసిన సీఎం చంద్రబాబు 2/15

పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువ ద్వారా ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను విడుదల చేశారు. పాయకరావుపేట వద్ద పోలవరం ఎడమ కాలువ క్రాస్ రెగ్యులేటర్ నుంచి నీటిని విడుదల చేసి జలహారతి ఇచ్చారు.

 గోదావరి జలాలకు సాష్టాంగ నమస్కారం చేసిన సీఎం చంద్రబాబు 3/15

అంతకుముందు ఏరియల్ వ్యూ ద్వారా పోలవరం ఎడమ కాలువను ముఖ్యమంత్రి పరిశీలించారు.

 గోదావరి జలాలకు సాష్టాంగ నమస్కారం చేసిన సీఎం చంద్రబాబు 4/15

పాయకరావుపేటకు చేరుకున్న సీఎం చంద్రబాబుకు జిల్లా నేతలు, అధికారులు, ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. సంప్రదాయ కోలాటంతో ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు.

 గోదావరి జలాలకు సాష్టాంగ నమస్కారం చేసిన సీఎం చంద్రబాబు 5/15

అనంతరం పోలవరం ఎడమ కాలువ ద్వారా అనకాపల్లి జిల్లాకు గోదావరి జలాలను అందిస్తున్న సందర్భంగా ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు.

 గోదావరి జలాలకు సాష్టాంగ నమస్కారం చేసిన సీఎం చంద్రబాబు 6/15

కూటమి ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి శిలాఫలకం వద్ద ఫొటోలు దిగారు.

 గోదావరి జలాలకు సాష్టాంగ నమస్కారం చేసిన సీఎం చంద్రబాబు 7/15

గోదావరి జలాలకు సీఎం చంద్రబాబు సాష్టాంగ నమస్కారం చేశారు.

 గోదావరి జలాలకు సాష్టాంగ నమస్కారం చేసిన సీఎం చంద్రబాబు 8/15

గోదావరి జలాలను ఉత్తరాంధ్ర జిల్లాలకు విడుదల చేసిన అనంతరం రైతులు, ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు.

 గోదావరి జలాలకు సాష్టాంగ నమస్కారం చేసిన సీఎం చంద్రబాబు 9/15

ఈ కార్యక్రమంలో మంత్రులు నిమ్మల రామానాయుడు, వంగలపూడి అనితతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

 గోదావరి జలాలకు సాష్టాంగ నమస్కారం చేసిన సీఎం చంద్రబాబు 10/15

ఎడమ కాలువ ద్వారా అనకాపల్లి జిల్లాకు చేరుకున్న గోదావరి జలాలకు ముఖ్యమంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

 గోదావరి జలాలకు సాష్టాంగ నమస్కారం చేసిన సీఎం చంద్రబాబు 11/15

పోలవరం ఎడమ కాలువ ద్వారా విడుదల చేసే గోదావరి జలాలతో ఉత్తరాంధ్రలోని నాలుగు జిల్లాల పరిధిలో సుమారు 2.87 లక్షల ఎకరాలకు సాగునీరు, దాదాపు 9 లక్షల మందికి తాగునీరు అందించేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది.

 గోదావరి జలాలకు సాష్టాంగ నమస్కారం చేసిన సీఎం చంద్రబాబు 12/15

ఎడమ కాలువ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.4,192 కోట్లను ఖర్చు చేసింది.

 గోదావరి జలాలకు సాష్టాంగ నమస్కారం చేసిన సీఎం చంద్రబాబు 13/15

అనకాపల్లి జిల్లాలో గోదావరి జలాలను ఏలేరు కాలువతో పాటు 110 చెరువులకు మళ్లించి నీటిని నింపేలా జల వనరుల శాఖ చర్యలు చేపట్టింది. గోదావరి జలాల ద్వారా పుష్కర ఆయకట్టు పరిధిలో 1.48 లక్షల ఎకరాలు, ఏలేరు కింద 80 వేల ఎకరాలు, పంపా కింద 12 వేల ఎకరాలు, తాండవ, వరహా, మామిడిగడ్డ ఆయకట్టు పరిధిలో 46,620 ఎకరాలకు నీటి స్థిరీకరణ చేపట్టనున్నారు.

 గోదావరి జలాలకు సాష్టాంగ నమస్కారం చేసిన సీఎం చంద్రబాబు 14/15

పోలవరం ఎడమ కాలువ ద్వారా ఉత్తరాంధ్రకు గోదావరి జలాల విడుదల ఈ ప్రాంత వ్యవసాయం, తాగునీరు, పారిశ్రామిక అవసరాలకు కీలకంగా మారనుంది.

 గోదావరి జలాలకు సాష్టాంగ నమస్కారం చేసిన సీఎం చంద్రబాబు 15/15

అదేవిధంగా 23.44 టీఎంసీల గోదావరి జలాలను విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో పారిశ్రామిక అవసరాలతో పాటు తాగునీరు, సాగునీటి అవసరాలకు వినియోగించేలా ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది.

Updated at - Sep 02 , 2026 | 07:16 PM