ఢిల్లీలో ప్రధాని మోదీ, కేంద్రమంత్రులతో సీఎం చంద్రబాబు భేటీ

ABN, Publish Date - Jul 23 , 2026 | 07:25 AM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం ఢిల్లీలో పర్యటించారు. హస్తీన పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ, పలువురు కేంద్రమంత్రులను సీఎం కలిశారు. ఆయా సమావేశాల్లో ఏపీకి సంబంధించిన అభివృద్ధి పనులపై సీఎం చర్చించారు.

ఢిల్లీలో ప్రధాని మోదీ, కేంద్రమంత్రులతో సీఎం చంద్రబాబు భేటీ 1/16

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం ఢిల్లీలో పర్యటించారు. హస్తీన పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ, పలువురు కేంద్రమంత్రులను సీఎం కలిశారు.

ఢిల్లీలో ప్రధాని మోదీ, కేంద్రమంత్రులతో సీఎం చంద్రబాబు భేటీ 2/16

ఆయా సమావేశాల్లో ఏపీకి సంబంధించిన అభివృద్ధి పనులపై సీఎం చర్చించారు.

ఢిల్లీలో ప్రధాని మోదీ, కేంద్రమంత్రులతో సీఎం చంద్రబాబు భేటీ 3/16

ప్రధాని నరేంద్రమోదీతో సీఎం చంద్రబాబు గంటకు పైగా సమావేశమై వివిధ అంశాలపై మాట్లాడారు.

ఢిల్లీలో ప్రధాని మోదీ, కేంద్రమంత్రులతో సీఎం చంద్రబాబు భేటీ 4/16

ఆగస్టు 1వ తేదీన భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభోత్సవానికి రావాలని ప్రధాని మోదీని ఆహ్వానించారు.

ఢిల్లీలో ప్రధాని మోదీ, కేంద్రమంత్రులతో సీఎం చంద్రబాబు భేటీ 5/16

అలాగే, కీలక బిల్లుల ఆమోదంపై ఇరువురి మధ్య చర్చ జరిగింది. కేంద్రం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న మహిళా రిజర్వేషన్‌, డీలిమిటేషన్‌కు సంబంధించిన 130వ రాజ్యాంగ సవరణ బిల్లును ఆమోదించేందుకు అవలంబించాల్సిన వ్యూహంపై దాదాపు 40 నిమిషాలు ముఖాముఖి చర్చలు జరిపారు.

ఢిల్లీలో ప్రధాని మోదీ, కేంద్రమంత్రులతో సీఎం చంద్రబాబు భేటీ 6/16

వచ్చేవారం పార్లమెంటులో కొన్ని కీలక బిల్లులు ఆమోదం పొందుతాయి. ఆ తర్వాతి వారంలో కీలకమైన రాజ్యాంగ సవరణ బిల్లును ఆమోదించి... మహిళలు ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న రిజర్వేషన్‌ను అమలు చేయాలని భావిస్తున్నామని సీఎం చంద్రబాబుకు మోదీ చెప్పినట్లు తెలిసింది.

ఢిల్లీలో ప్రధాని మోదీ, కేంద్రమంత్రులతో సీఎం చంద్రబాబు భేటీ 7/16

అలాగే, కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్‌తో సీఎం చంద్రబాబు సమావేశం అయ్యారు.

ఢిల్లీలో ప్రధాని మోదీ, కేంద్రమంత్రులతో సీఎం చంద్రబాబు భేటీ 8/16

ఈ సమావేశంలో రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి, కొత్త పెట్టుబడుల ఆకర్షణ, ఎగుమతుల విస్తరణ, ఉపాధి అవకాశాల పెంపు వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు.

ఢిల్లీలో ప్రధాని మోదీ, కేంద్రమంత్రులతో సీఎం చంద్రబాబు భేటీ 9/16

రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు అనుకూల వాతావరణం కల్పించడంపై మాట్లాడారు. దేశీయ, విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా ఆర్థికాభివృద్ధిని వేగవంతం చేసే అంశాలు ఈ సమావేశంలో ప్రధానంగా ప్రస్తావనకు వచ్చాయి.

ఢిల్లీలో ప్రధాని మోదీ, కేంద్రమంత్రులతో సీఎం చంద్రబాబు భేటీ 10/16

కేంద్ర గృహ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌తో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు.

ఢిల్లీలో ప్రధాని మోదీ, కేంద్రమంత్రులతో సీఎం చంద్రబాబు భేటీ 11/16

ఈ భేటీలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై సవివరంగా చర్చించారు.

ఢిల్లీలో ప్రధాని మోదీ, కేంద్రమంత్రులతో సీఎం చంద్రబాబు భేటీ 12/16

ముఖ్యంగా విశాఖపట్నం మెట్రో రైల్ ప్రాజెక్ట్ పురోగతి, కేంద్ర సహకారం, నిధుల కేటాయింపు వంటి అంశాలు ఈ సమావేశంలో ప్రధానంగా ప్రస్తావనకు వచ్చాయి.

ఢిల్లీలో ప్రధాని మోదీ, కేంద్రమంత్రులతో సీఎం చంద్రబాబు భేటీ 13/16

కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌తో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు.

ఢిల్లీలో ప్రధాని మోదీ, కేంద్రమంత్రులతో సీఎం చంద్రబాబు భేటీ 14/16

ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన నదీ జలాల నిర్వహణ, సాగునీటి ప్రాజెక్టుల పురోగతి, నీటి వనరుల వినియోగం, భవిష్యత్తు జల ప్రణాళికలపై సవివరంగా చర్చించారు.

ఢిల్లీలో ప్రధాని మోదీ, కేంద్రమంత్రులతో సీఎం చంద్రబాబు భేటీ 15/16

ఏపీ వ్యవసాయాభివృద్ధికి అత్యంత కీలకమైన సాగునీటి ప్రాజెక్టుల అమలు, నీటి నిల్వ సామర్థ్యాల పెంపు తదితర అంశాలపై ఇరువురు నేతలు అభిప్రాయాలు పంచుకున్నారు.

ఢిల్లీలో ప్రధాని మోదీ, కేంద్రమంత్రులతో సీఎం చంద్రబాబు భేటీ 16/16

ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగుతున్న ప్రధాన జలవనరుల ప్రాజెక్టులు, వాటి అభివృద్ధికి కేంద్ర సహకారం, నిధుల కేటాయింపు వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు.

Updated at - Jul 23 , 2026 | 08:00 AM