నంద్యాల జిల్లాలో పాస్ పుస్తకాలు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు

ABN, Publish Date - Jul 09 , 2026 | 09:17 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు (గురువారం) నంద్యాల జిల్లాలోని బనగానపల్లెలో పర్యటించి, పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

నంద్యాల జిల్లాలో పాస్ పుస్తకాలు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు 1/13

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు (గురువారం) నంద్యాల జిల్లాలోని బనగానపల్లెలో పర్యటించి, పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

నంద్యాల జిల్లాలో పాస్ పుస్తకాలు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు 2/13

అప్పలాపురం, కాపులపల్లి రైతులకు రాజముద్రతో కూడిన పాస్ పుస్తకాలను సీఎం పంపిణీ చేశారు.

నంద్యాల జిల్లాలో పాస్ పుస్తకాలు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు 3/13

మీ భూమి మీ హక్కు కార్యక్రమానికి సీఎం హాజరయ్యారు. అలాగే తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించారు.

నంద్యాల జిల్లాలో పాస్ పుస్తకాలు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు 4/13

ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా 1500 మందితో బనగానపల్లిలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

నంద్యాల జిల్లాలో పాస్ పుస్తకాలు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు 5/13

ప్రజలకు సేవలు ఎలా అందుతున్నాయో సంబంధిత అధికారులను అడిగి సీఎం తెలుసుకున్నారు. అనంతరం రైతులతోనూ ముఖ్యమంత్రి చర్చించారు.

నంద్యాల జిల్లాలో పాస్ పుస్తకాలు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు 6/13

అనంతరం ప్రజావేదిక సభలో సీఎం చంద్రబాబు ప్రసంగించారు. జగన్ హయాంలో తీసుకున్న అనాలోచిత నిర్ణయాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని విమర్శించారు.

నంద్యాల జిల్లాలో పాస్ పుస్తకాలు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు 7/13

వైసీపీ హయాంలో తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్.. ప్రజల్లో భయాందోళనలు సృష్టించిందని ధ్వజమెత్తారు.

నంద్యాల జిల్లాలో పాస్ పుస్తకాలు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు 8/13

జగన్ హయాంలో మాట వినని వారి భూములను 22ఏ జాబితాలో చేర్చారని సీఎం చంద్రబాబు ఆగ్రహించారు.

నంద్యాల జిల్లాలో పాస్ పుస్తకాలు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు 9/13

తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను రద్దు చేశామని సీఎం చంద్రబాబు తెలిపారు.

నంద్యాల జిల్లాలో పాస్ పుస్తకాలు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు 10/13

ప్రజల ఆస్తిపై ప్రజలకే హక్కు ఉండాలని సీఎం స్పష్టం చేశారు. భూమి ప్రజలదైతే పట్టా పుస్తకాలపై, భూమి సరిహద్దు రాళ్లపై వారి ఫొటోలు, పేర్లు మాత్రమే ముద్రించాలని సీఎం చంద్రబాబు తెలిపారు.

నంద్యాల జిల్లాలో పాస్ పుస్తకాలు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు 11/13

జగన్‌కు ఫొటోల పిచ్చి పరాకాష్ఠకు చేరిందని సీఎం విమర్శించారు. ఆయన ఫొటోలతో ఉన్న పాత పట్టాదారు పాస్‌పుస్తకాలను రద్దు చేసి, ఇప్పుడు రాజముద్రతో పాస్‌పుస్తకాలను అందిస్తున్నామని సీఎం చంద్రబాబు చెప్పారు.

నంద్యాల జిల్లాలో పాస్ పుస్తకాలు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు 12/13

రైతులకు పారదర్శకమైన సేవలు అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

నంద్యాల జిల్లాలో పాస్ పుస్తకాలు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు 13/13

ప్రతి సమస్యనూ పరిష్కరించే బాధ్యత తమదేనని చెప్పారు. దళారీ వ్యవస్థకు తావు లేకుండా గ్రామసభల్లోనే పట్టాదారు పాస్‌పుస్తకాలు పంపిణీ చేస్తున్నామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

Updated at - Jul 09 , 2026 | 09:35 PM