ఏపీ పోలీస్‌ రిట్రీట్‌- 2026 సమావేశానికి హాజరైన సీఎం చంద్రబాబు

ABN, Publish Date - Jul 24 , 2026 | 11:45 AM

విజయవాడలో రెండు రోజుల పాటు నిర్వహించిన ఏపీ పోలీస్ రిట్రీట్–2026 ఫ్యూచర్ పోలీసింగ్ కాన్ఫరెన్స్ విజయవంతంగా ముగిసింది. ఈ సదస్సు ముగింపు సమావేశానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరై పోలీసు శాఖ భవిష్యత్తు కార్యాచరణ, ఆధునిక పోలీసింగ్ విధానాలపై దిశానిర్దేశం చేశారు.

ఏపీ పోలీస్‌ రిట్రీట్‌- 2026 సమావేశానికి హాజరైన సీఎం చంద్రబాబు 1/12

విజయవాడలో రెండు రోజుల పాటు నిర్వహించిన ఏపీ పోలీస్ రిట్రీట్–2026 ఫ్యూచర్ పోలీసింగ్ కాన్ఫరెన్స్ విజయవంతంగా ముగిసింది.

ఏపీ పోలీస్‌ రిట్రీట్‌- 2026 సమావేశానికి హాజరైన సీఎం చంద్రబాబు 2/12

ఈ సదస్సు ముగింపు సమావేశానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం హాజరయ్యారు.

ఏపీ పోలీస్‌ రిట్రీట్‌- 2026 సమావేశానికి హాజరైన సీఎం చంద్రబాబు 3/12

పోలీసు శాఖ భవిష్యత్తు కార్యాచరణ, ఆధునిక పోలీసింగ్ విధానాలపై సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.

ఏపీ పోలీస్‌ రిట్రీట్‌- 2026 సమావేశానికి హాజరైన సీఎం చంద్రబాబు 4/12

ఏపీలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు సాంకేతికత ఆధారిత పోలీసింగ్‌ను మరింత బలోపేతం చేయడంపై పోలీసులకు సీఎం మార్గనిర్దేశం చేశారు.

ఏపీ పోలీస్‌ రిట్రీట్‌- 2026 సమావేశానికి హాజరైన సీఎం చంద్రబాబు 5/12

ప్రజలకు వేగవంతమైన సేవలు అందించడం, సైబర్ నేరాల నియంత్రణ, కృత్రిమ మేధ (AI) వినియోగం, డేటా ఆధారిత దర్యాప్తు వంటి అంశాలపై ఈ సదస్సులో విస్తృతంగా సీఎం చంద్రబాబు చర్చించారు.

ఏపీ పోలీస్‌ రిట్రీట్‌- 2026 సమావేశానికి హాజరైన సీఎం చంద్రబాబు 6/12

రెండు రోజుల పాటు జరిగిన ఈ కాన్ఫరెన్స్‌లో ఉన్నత పోలీసు అధికారులు, జిల్లా ఎస్పీలు, కమిషనర్లు, విభాగాధిపతులు పాల్గొని భవిష్యత్తు పోలీసింగ్‌కు సంబంధించిన కార్యాచరణపై అభిప్రాయాలు పంచుకున్నారు.

ఏపీ పోలీస్‌ రిట్రీట్‌- 2026 సమావేశానికి హాజరైన సీఎం చంద్రబాబు 7/12

ప్రజలకు మరింత పారదర్శకమైన, సమర్థవంతమైన, సాంకేతికత ఆధారిత పోలీసు సేవలు అందించే దిశగా తీసుకోవాల్సిన చర్యలపై కూడా ఈ సమావేశంలో సీఎం చంద్రబాబు చర్చించారు.

ఏపీ పోలీస్‌ రిట్రీట్‌- 2026 సమావేశానికి హాజరైన సీఎం చంద్రబాబు 8/12

పోలీసు శాఖ ఆధునికీకరణ, స్మార్ట్ పోలీసింగ్, సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, ప్రజా భద్రతను మరింత బలోపేతం చేసే అంశాలపై ముఖ్యమంత్రి కీలక సూచనలు చేశారు.

ఏపీ పోలీస్‌ రిట్రీట్‌- 2026 సమావేశానికి హాజరైన సీఎం చంద్రబాబు 9/12

రాష్ట్రాన్ని దేశంలోనే అత్యుత్తమ పోలీసింగ్ వ్యవస్థ కలిగిన రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

ఏపీ పోలీస్‌ రిట్రీట్‌- 2026 సమావేశానికి హాజరైన సీఎం చంద్రబాబు 10/12

ఈ సదస్సులో తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ పనితీరును మరింత సమర్థవంతంగా మార్చడంతో పాటు ప్రజా భద్రత, నేర నియంత్రణ, సాంకేతిక సామర్థ్యాల పెంపునకు దోహదపడనున్నాయని అధికారులు అభిప్రాయపడ్డారు.

ఏపీ పోలీస్‌ రిట్రీట్‌- 2026 సమావేశానికి హాజరైన సీఎం చంద్రబాబు 11/12

మారుతున్న నేరాల స్వరూపానికి అనుగుణంగా రాష్ట్ర పోలీసు వ్యవస్థను పూర్తిగా ఆధునీకరించాలని సీఎం చంద్రబాబు సూచించారు.

ఏపీ పోలీస్‌ రిట్రీట్‌- 2026 సమావేశానికి హాజరైన సీఎం చంద్రబాబు 12/12

టెక్నాలజీ అధారిత దర్యాప్తు, సైబర్‌ నేరాల నియంత్రణ, మహిళల భద్రత, ఫోరెన్సిక్‌ సామర్థ్యాల పెంపు, ప్రజలకు మరింత చేరువయ్యే పోలీసింగ్‌.. ఇవే భవిష్యత్‌ పోలీసింగ్‌కు మూల సూత్రాలని స్పష్టం చేశారు.

Updated at - Jul 24 , 2026 | 12:49 PM