వచ్చే ఆగస్టు 7, 8 తేదీల్లో టీసీఏ స్వర్ణోత్సవ మహాసభలు
ABN , Publish Date - May 31 , 2026 | 02:18 PM
అమెరికా గడ్డపై తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను ఐదు దశాబ్దాలుగా తరతరాలకు అందిస్తూ విజయవంతంగా కొనసాగుతున్న ప్రతిష్ఠాత్మక సంస్థ టీసీఏ యాభై వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా స్వర్ణోత్సవాలు నిర్వహించేందుకు సన్నద్ధమవుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికా గడ్డపై తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను ఐదు దశాబ్దాలుగా తరతరాలకు అందిస్తూ విజయవంతంగా కొనసాగుతున్న ప్రతిష్ఠాత్మక సంస్థ ‘హ్యూస్టన్ తెలుగు సాంస్కృతిక సమితి(TCA)’ ఒక విశిష్టమైన మైలురాయిని చేరుకుంది. 50 ఏళ్ల ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుని 51వ సంవత్సరంలోకి ప్రవేశించిన సందర్భంగా.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు సమాజాన్ని ఏకం చేస్తూ భారీ స్థాయిలో ‘స్వర్ణోత్సవాలు(Golden Jubilee Celebrations)’ నిర్వహించేందుకు టీసీఏ సిద్ధమవుతోంది.
వేడుకల వివరాలు:
ఈ మూడు రోజుల కార్యక్రమాలు 2026 ఆగస్టు 7 నుంచి 9 వరకు టెక్సాస్ రాష్ట్రంలోని రోసెన్‌బర్గ్ నగరంలో ఉన్న ‘ఫోర్ట్ బెండ్ ఎపిసెంటర్’ (FORT BEND EPICENTER – 28505 Southwest Fwy, Rosenberg, TX 77471) వేదికగా ఘనంగా జరగనున్నాయి.

‘మన భాష - మన సంస్కృతి - మన సంప్రదాయం’ అనే ఉన్నత విలువలను కాపాడుతూ తెలుగు భాష, సాహిత్యం, సంగీతం, నృత్యం, నాటకం వంటి కళారూపాలను ప్రోత్సహించడమే కాకుండా సామాజిక సేవా కార్యక్రమాలకు కూడా ఈ వేదిక ప్రాధాన్యం ఇవ్వనుంది. యువతలో నాయకత్వ లక్షణాలను పెంపొందించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ స్వర్ణోత్సవాలు ఒక వేడుక మాత్రమే కాకుండా గత 50 సంవత్సరాలుగా తెలుగు సమాజం చూపిన భాషాభిమానం, ఐక్యత, సేవాస్ఫూర్తికి ప్రతీకగా నిలుస్తాయని నిర్వాహకులు పేర్కొన్నారు.

ఇవీ చదవండి:
జార్జియాలో భారత విద్యార్థి అదృశ్యం! నదిలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం
కువైట్‌లో ఘనంగా మహానాడు, ఎన్టీఆర్ 104వ జయంతి వేడుకలు