కువైట్‌లో ఘనంగా మహానాడు, ఎన్టీఆర్ 104వ జయంతి వేడుకలు
ABN , Publish Date - May 30 , 2026 | 06:52 PM
ఎన్నారై తెలుగుదేశం కువైట్ ఆధ్వర్యంలో మహానాడు, నందమూరి తారక రామారావు 104వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ సిద్ధాంతాలు, తెలుగు ప్రజలకు ఎన్టీఆర్ అందించిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. ప్రవాస తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఇంటర్నెట్ డెస్క్: తెలుగుదేశం పార్టీ హైబ్రిడ్ విధానంలో జూమ్ వేదికగా ఆన్‌లైన్‌లో నిర్వహించిన మహానాడు కార్యక్రమంలో కువైట్ తెలుగుదేశం విభాగం నుంచి పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కువైట్‌లోని ఫర్వానియా ప్రాంతంలో ఉన్న ద్వైహి ప్యాలెస్ హోటల్‌లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించగా, తెలుగుదేశం నాయకులతో పాటు జనసేన నాయకులు కూడా హాజరై శుభాకాంక్షలు తెలియజేశారు.
కుదరవల్లి సుధాకర రావు ఆధ్వర్యంలో మద్దిన ఈశ్వర్ నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మాలేపాటి సురేష్ బాబు నాయుడు, బిల్లా రమేష్ యాదవ్, రషీదా బేగం, పోలారపు బాబు నాయుడు, వెంకట సుబ్బయ్య, రాపాక రాజేష్, శిద్దా అంజనమ్మ, లాస్య రాజు, ఆషిష్ రాహుల్, శివ గాధిరాజు, మొదలగు వారు పాల్గొనగా.. జనసేన నాయకులు జాతీయ కన్వీనర్స్ కంచన శ్రీకాంత్ బాబు, రామచంద్ర నాయక్, కువైట్ కన్వీనర్ ఆకుల రాజేష్, పెద్దలు దండు చంద్ర శేఖర్, కో-కన్వీనర్స్ ఆలి షేక్, ఇమ్మిడిసెట్టి సూర్యనారాయణ పాల్గొన్నారు.
మహానాడు కార్యక్రమంలో పాల్గొన్న వక్తలు తెలుగుదేశం పార్టీ స్థాపన నుంచి నేటి వరకు పార్టీ అభివృద్ధి, ప్రజా సంక్షేమ కార్యక్రమాల కొనసాగింపును వివరించారు. ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ సిద్ధాంతాలను నారా చంద్రబాబు నాయుడు సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారని పేర్కొన్నారు. జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నారా లోకేష్ బాబు ఎన్నికైనందుకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి కోసం లోకేష్ బాబు చేస్తున్న కృషిని, అలాగే పవన్ కల్యాణ్ సహకారాన్ని సుధాకర రావు ప్రశంసించారు. కార్యక్రమం చివరలో కేక్ కట్ చేసి ఎన్టీఆర్ 104వ జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు.
Also Read:
బే ఏరియాలో ఘనంగా ఎన్టీఆర్ 103వ జయంతి వేడుకలు
రూ.34 కోట్ల బ్లడ్ మనీతో తప్పిన మరణశిక్ష! 20 ఏళ్ల తరువాత భారత్‌కు..