Share News

లాస్ ఏంజెల్స్‌లో వైభవంగా మినీ మహానాడు, ఎన్టీఆర్ జయంతి వేడుకలు

ABN , Publish Date - May 31 , 2026 | 09:44 AM

అమెరికాలోని లాస్ ఏంజెల్స్ నగరంలో తెలుగు ప్రజలు ఘనంగా మినీ మహానాడు, స్వర్గీయ ఎన్టీఆర్ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ప్రవాస తెలుగు సంఘాల ప్రతినిధులు, టీడీపీ అభిమానులు పాల్గొన్నారు.

లాస్ ఏంజెల్స్‌లో వైభవంగా మినీ మహానాడు, ఎన్టీఆర్ జయంతి వేడుకలు
Mini Mahanadu Los Angeles

లాస్ ఏంజెల్స్‌ (యుఎస్ఎ): ఎన్‌ఆర్‌ఐ టీడీపీ లాస్ ఏంజెల్స్ ఆధ్వర్యంలో మినీ మహానాడు – 2026, స్వర్గీయ నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సుమారు 150 మందికి పైగా పార్టీ కార్యకర్తలు, అభిమానులు, ప్రవాస తెలుగు ప్రజలు పాల్గొని ఎన్టీఆర్ సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా మహానాడు తీర్మానాలు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, ప్రవాస భారతీయుల పాత్ర, అలాగే పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చలు జరిగాయి. నాయకులు, కార్యకర్తలు పార్టీ సిద్ధాంతాల పట్ల తమ అంకితభావాన్ని పునరుద్ఘాటించారు. ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించి, తెలుగు జాతికి ఆయన అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ వేడుకలు ప్రవాస తెలుగు సమాజంలో పార్టీ పట్ల ఉన్న ఆదరణను, ఐక్యతను మరోసారి చాటిచెప్పాయి.

TDP (18).jpg


ఎన్ఆర్ఐల పాత్ర మరువలేనిది: రామ్మోహన్ నాయుడు

లాస్ ఏంజిల్స్ ఎన్ఆర్ఐ టీడీపీ నాయకులు అట్లూరి శ్రీహరి, హేమకుమార్ గొట్టి, శ్రీధర్ సాతులూరి, వంశీ గరికపాటి, విష్ణు యలమంచి, ప్రతాప్ మెతరమిట్ట, సురేష్ అయినంపూడి, సురేష్ అంబటి, చందు గుత్తికొండ, శ్రీకాంత్ అత్తోటి, కిషోర్ గరికపాటి, వెంకట్ సుంకర, నేతృత్వంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు జూమ్ ద్వారా హాజరయ్యారు.

NRI (4).jpg

ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ... ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, యువనేత లోకేష్ నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా పరుగులు తీస్తోందన్నారు. వారి కృషివల్ల గూగుల్, ఆర్సెల్లార్ మిట్టల్ వంటి భారీ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయన్నారు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టును జులైలో ప్రధాని నరేంద్ర మోదీ చేతులమీదుగా ప్రారంభించబోతున్నామని తెలిపారు. దీంతో ఉత్తరాంధ్ర ముఖచిత్రం మారబోతోందని, రాష్ట్రంలో కొత్తగా మరో 7ఎయిర్ పోర్టులు రాబోతున్నాయని వెల్లడించారు. విజయవాడ నుంచి సింగపూర్‌కు ఇప్పటికే డైరక్ట్ సర్వీసులు ప్రారంభించామని, త్వరలోనే మలేషియా, హాంకాంగ్, గల్ఫ్ దేశాలకు కూడా నేరుగా సర్వీసులు ప్రారంభిస్తామని చెప్పారు. గత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం విజయంలో ఎన్ఆర్ఐల పాత్ర మరువలేనిదని, అందరి సహకారం, ఆశీర్వాదంతో 2029 ఎన్నికల్లో కూడా ఘన విజయం సాధిస్తామని రామ్మోహన్ నాయుడు అన్నారు.

ఎన్ఆర్ఐలకు వారధిగా ఉంటా: కోమటి జయరాం

ఉత్తర అమెరికా ప్రత్యేక ప్రతినిధి కోమటి జయరాం మాట్లాడుతూ... రాష్ట్రాభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు నాయుడు, యువనేత లోకేష్ చేస్తున్న కృషికి ప్రవాసాంధ్రుల సహకారం అవసరమన్నారు. ఏపీలో పెట్టుబడులకు ఆసక్తి ఉన్న ఎన్ఆర్ఐలకు ఎటువంటి సాయం కావాల్సి వచ్చినా తాను వారధిగా ఉంటానని చెప్పారు. తెలుగుదేశం జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి రామ్ మాట్లాడుతూ మాట్లాడుతూ... గత సార్వత్రిక ఎన్నికల్లో ఎన్ఆర్ఐల సహకారంతో విజయ దుందుభి మోగించామని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మీవంతు సహాయ, సహకారాలు అందించాలని కోరారు.

TDP (17).jpg

ప్రముఖ విశ్లేషకులు తెలుగుదేశం అధికార ప్రతినిధి అప్పసాని రాజేష్ మాట్లాడుతూ... ఎన్టీఆర్ జయంతి, మినీ మహానాడు కార్యక్రమాలను ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రాభివృద్ధికి ఎన్ఆర్‌ఐల సహకారం అవసరమని అన్నారు.


ఈ కార్యక్రమంలో లాస్ ఏంజిల్స్ లోని టీడీపీ అభిమానులు వేణుగోపాల్ జెట్టి, మధు బోడపాటి, రంగరావు నన్నపునేని, యార్లగడ్డ శ్రీనివాస్, మనోహర్ మద్దినేని, రమేష్ మంగా, వై.అనిల్ కుమార్, అచ్చయ్య చౌదరి, రవి పిన్నింటి, శ్రీకాంతి రామినేని, శ్రీకాంతి ఆమినేని, భారతి పెద్ది, వీరా వెంకట్సుధీర్ కోనేరు, వేణు గర్నేని, శివనాగ, మనోహర, నేతాజీ గుర్రం, సతీష్ యలవర్తి, సందీప్ నాయుడు రతినా, రాజ్య రావూరి, వై.విజయ్, వెంకట వాసిరెడ్డి, రూపేష్ నారా, మురళీకృష్ణ, రాహుల్ పోతిన, వి.శ్రీనివాస్, మురళీ స్వర్ణ, పి.రవికుమార్, కె.చిన్న, సి.ఆంజనేయులు, వెంకటప్రసాద్ కె, రవి చుండు సురేష్ కోటపాటి, ఎస్.అనిల్ కుమార్, పి.వెంకట్, భారత్ పొట్లూరి, నందన్ పొట్లూరి, సురేష్ కందేపు , సుమంత్ వైదన, వెంకట్ కొలనుపాక, ప్రశాంత్ అల్లాని, వెంకట్ కోరిపెల్ల, చందు పల్లెబోయిన తదితరులు పాల్గొన్నారు.


Also Read:

జార్జియాలో భారత విద్యార్థి అదృశ్యం! నదిలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం

కువైట్‌లో ఘనంగా మహానాడు, ఎన్టీఆర్ 104వ జయంతి వేడుకలు

Updated Date - May 31 , 2026 | 10:06 AM