Share News

జార్జియాలో భారత విద్యార్థి అదృశ్యం! నదిలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం

ABN , Publish Date - May 30 , 2026 | 09:51 PM

జార్జియా దేశంలో మెడిసిన్ విద్యను అభ్యసిస్తున్న ఒక భారతీయ విద్యార్థి 15 రోజుల క్రితం కనిపించకుండా పోయారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులకు తాజాగా గుర్తు తెలియని మృతదేహం లభించింది.

జార్జియాలో భారత విద్యార్థి అదృశ్యం! నదిలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం
Dhvanit Rajdeep

ఇంటర్నెట్ డెస్క్: జార్జియా దేశంలో 15 రోజుల క్రితం అదృశ్యమైన భారతీయ వైద్య విద్యార్థి ధ్వనిత్ రాజ్‌దీప్ కేసులో పోలీసులు తాజాగా అక్కడి నదిలో గుర్తు తెలియని మృతదేశాన్ని గుర్తించారు. అది ధ్వనిత్ మృతదేహమని అనుమానిస్తున్నారు. మృతదేహం బాగా కుళ్లిపోయిన స్థితిలో ఉండటంతో గుర్తింపు కోసం యువకుడి కుటుంబం నుంచి డీఎన్ఏ శాంపిల్స్‌ను సేకరించారు.

అహ్మదాబాద్‌కు (గుజరాత్) చెందిన ధ్వనిత్ రాజ్‌దీప్ స్థానిక కాకసస్ ఇంటర్నేషన్ యూనివర్సిటీలో వైద్య విద్యను అభ్యసిస్తున్నారు. మే 14న తమ కుమారుడితో చివరిసారిగా మాట్లాడమని ధ్వనిత్ తండ్రి మయూర్ రాజ్‌దీప్ తెలిపారు. భారత్‌కు వచ్చేందుకు ఎయిర్‌పోర్టుకు వెళుతున్నట్టు ధ్వనిత్ మే 14న చెప్పాడని అన్నారు. ఆ తరువాత అతడి ఫోన్ స్విచ్చాఫ్ వచ్చిందని అన్నారు. నాటి నుంచీ ధ్వనిత్ జాడ తెలియరాలేదు. ఈ క్రమంలో గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులకు తాజాగా ఒక గుర్తు తెలియని మృతదేహం లభించింది.


ధ్వనిత్ అక్కడ ఒక భారతీయుడి ఇంట్లో అద్దెకు ఉండేవాడని మయూర్ రాజ్‌దీప్ తెలిపారు. ఇంటి ఓనర్ తమ కుమారుడిని వేధిస్తున్నట్టు తెలిసిందని చెప్పారు. ఈ విషయాన్ని తమ కుమారుడు స్వయంగా చెప్పాడని అన్నారు. అధిక డబ్బులు ఇవ్వాలని వేధించారని, ఇల్లు ఖాళీ చేసి వెళితే తీవ్రపరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఓనర్ తమ కుమారుడిని హెచ్చరించినట్టు చెప్పారు. ఒక దశలో తమ కుమారుడిని ఆ ఇంట్లోని ఒక గదిలో బంధించారని కూడా ఆరోపించారు.


Also Read:

రూ.34 కోట్ల బ్లడ్ మనీతో తప్పిన మరణశిక్ష! 20 ఏళ్ల తరువాత భారత్‌కు..

ఎన్టీఆర్ జయంతి ఉత్సవాలు.. బర్మింగ్‌హామ్‌లో అన్నదానం

Updated Date - May 30 , 2026 | 10:00 PM