యూఎస్‌లోని విద్యార్థులకు తానా గుడ్ న్యూస్
ABN , Publish Date - Mar 06 , 2026 | 06:07 PM
యూఎస్‌లో తెలుగు వారికే కాదు.. దేశవ్యాప్తంగా ఉన్న స్కూల్ విద్యార్థులకు తానా గుడ్ న్యూస్ చెప్పింది.
వాషింగ్టన్: ఉత్తర అమెరికా తెలుగు సంఘం.. తానా (Telugu Association of North America), టెస్ట్ ప్రెప్ పండిట్స్ (Test Prep Pundits) సంస్థతో కలిసి అమెరికా దేశవ్యాప్తంగా హైస్కూల్ విద్యార్థుల కోసం SAT ట్యూటరింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. విద్యార్థులు శాట్ (SAT) పరీక్షకు మెరుగైన సన్నద్ధత సాధించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తానా వెల్లడించింది. ఈ కార్యక్రమంలో దాదాపు $2000 డాలర్ల విలువైన SAT కోచింగ్‌ను కేవలం $75 డాలర్ల రిజిస్ట్రేషన్ ఫీజుతో అందిస్తున్నారు. ముఖ్యంగా ఈ కార్యక్రమం ద్వారా తెలుగు సమాజానికే కాకుండా అమెరికాలోని అన్ని కమ్యూనిటీల విద్యార్థులకు అందుబాటులో ఉంటుందని నిర్వాహకులు వెల్లడించారు.

2026, ఏప్రిల్ 3 నుంచి ఏప్రిల్ 25వ తేదీ వరకు ప్రతి శుక్రవారం, శనివారం ఆన్‌లైన్‌లో ఈ SAT ట్యూటరింగ్ ప్రోగ్రామ్ నిర్వహిస్తారని వివరించారు. మొత్తం 16 గంటల శిక్షణతో పాటు 2 పూర్తి స్థాయి SAT ప్రాక్టీస్ పరీక్షలు నిర్వహించి.. తద్వారా విద్యార్థుల ప్రగతిని అంచనా వేయనున్నట్లు చెప్పారు.
అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో శిక్షణ..
అన్వర్ – Test Prep Pundits సంస్థ స్థాపకులు, హ్యూస్టన్ ISDలో AP Calculus AB/BC ఉపాధ్యాయుడు – గణిత శిక్షణను అందిస్తారు.
మిస్ రానా కొరన్ – నేషనల్ బోర్డ్ సర్టిఫైడ్ ఇంగ్లీష్ ఉపాధ్యాయురాలు. లాస్ వెగాస్‌లో 15 సంవత్సరాలకుపైగా బోధనా అనుభవం ఉంది. ఇంగ్లీష్ రీడింగ్‌లో శిక్షణ ఇస్తారు.
మిస్టర్ నబిల్– SAT/ACT ఇంగ్లీష్ బోధనలో 6 సంవత్సరాల అనుభవం కలిగిన ఉపాధ్యాయుడు. ఇంగ్లీష్ రైటింగ్, గ్రామర్‌లో శిక్షణ అందిస్తారు.
కోర్సులో భాగంగా 6 గంటల గణితం, 5 గంటల ఇంగ్లీష్ రైటింగ్, 5 గంటల ఇంగ్లీష్ రీడింగ్ తరగతులు ఉంటాయి. ఇవే కాకుండా అదనంగా 2026, ఏప్రిల్ 1వ తేదీ ప్రారంభ ప్రాక్టీస్ టెస్ట్.. ఏప్రిల్ 26వ తేదీ ఫైనల్ ఫుల్ లెంగ్త్ టెస్ట్ నిర్వహించి.. విద్యార్థుల ప్రతిభను పరీక్షిస్తారు.
ఇప్పటికే తానా, Test Prep Pundits కలిసి నిర్వహించిన SAT ట్యూటరింగ్ కార్యక్రమాల ద్వారా సుమారు 2000 మంది విద్యార్థులకు శిక్షణ అందించారు. ఈ కార్యక్రమాల ద్వారా సేకరించిన నిధుల ద్వారా $100,000 డాలర్లకు పైగా నిధులు తానా ‘రైతు కోసం’ (TANA Rythu Kosam) కార్యక్రమానికి సమకూర్చి భారతదేశంలోని గ్రామీణ రైతులకు వ్యవసాయ పరికరాలను అందించనున్నట్లు నిర్వాహకులు వివరించారు.
విద్యార్థుల విద్యాభివృద్ధికి తోడ్పడటంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలకు సైతం మద్దతు ఇవ్వాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తానా నాయకులు సోదాహరణతో తెలిపారు. అమెరికాలోని హైస్కూల్ విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని పేర్లు రిజిస్టర్ చేసుకోవాలని వారి తల్లిదండ్రులకు తానా విజ్ఞప్తి చేసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
ఓహియోలో తానా వాలీబాల్ టోర్నమెంట్ ఘన విజయం
ఫ్రిస్కోలో మహిళల ఆరోగ్యంపై టాంటెక్స్ సదస్సు
For More Telugu News And NRI News