ఓహియోలో తానా వాలీబాల్ టోర్నమెంట్ ఘన విజయం
ABN , Publish Date - Mar 05 , 2026 | 07:18 PM
తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) ఆధ్వర్యంలో ఓహియో వ్యాలీలో ప్రాంతీయ వాలీబాల్ టోర్నమెంట్ మార్చి 1వ తేదీన కొలంబస్‌లో ఘనంగా నిర్వహించారు.
కొలంబస్ : తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) ఆధ్వర్యంలో ఓహియో వ్యాలీలో ప్రాంతీయ వాలీబాల్ టోర్నమెంట్ మార్చి 1వ తేదీన కొలంబస్‌లో ఘనంగా నిర్వహించారు. తెలుగు యువత, క్రీడాకారులు, కుటుంబాలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. తానా అధ్యక్షుడు డా. నరేన్ కొడాలి, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ లావు నాయకత్వంలో తానా క్రీడా కార్యక్రమాలు దేశవ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతున్నాయి. జాతీయ క్రీడా సమన్వయకర్త శివ చావా మార్గదర్శకత్వంలో ఈ టోర్నమెంట్ నిర్వహించారు.

ఈ కార్యక్రమాన్ని ఓహియో వ్యాలీ ప్రాంతీయ ప్రతినిధి ప్రదీప్ చందనం సమన్వయం చేసి విజయవంతంగా నిర్వహించారు. గత ఓహియో వ్యాలీ ప్రాంతీయ ప్రతినిధి శ్రీనివాస్ సంగ, శివ చావా, నాగేశ్వరరావు మన్నె, వీర ప్రతాప్, శ్రీకాంత్ రెడ్డి తోళ్ల, మనోజ్ సిరిగిరెడ్డి, చందు గుమ్మళ్ల, శ్రీకుమార్ కాసా, రాఘవ శ్రీహరి, సురేశ్ పార్వతి, రాజేష్, వీరేశ్ విల్లిగడ్ల, శ్యామ్ దుద్దెల, విప్పల రెడ్డి, యశ్ కోసన, తేజ తదితరులు హాజరై క్రీడాకారులను ప్రోత్సహించారు.

విజేతలు.. రన్నరప్ జట్లు
డివిజన్ – 1 విజేతలు: Night Fury's జట్టు – కెప్టెన్ ప్రకాశ్ కటకం
డివిజన్ – 1 రన్నరప్: Cleveland Setters జట్టు – కెప్టెన్ బాలా నెట్టెం
డివిజన్ – 2 విజేతలు: KMA జట్టు – కెప్టెన్ హర్ష పొలవరపు
డివిజన్ – 2 రన్నరప్: Volley Aces జట్టు – కెప్టెన్ రాంబాబు
విజేతలు, రన్నరప్ జట్లకు ఆంధ్రా పీపుల్ ఆఫ్ సెంట్రల్ ఓహియో స్థాపక సభ్యుడు నాగేశ్వరరావు మన్నె, మాజీ అధ్యక్షురాలు వాణి గద్దె ట్రోఫీలు అందజేశారు. ఈ కార్యక్రమానికి శ్రీ సాయి బాబా దేవాలయం బోర్డు చైర్మన్ తేజో వట్టి, శ్రీ వెంకటేశ్వర దేవాలయం అధ్యక్షుడు వెంకట్ కుసుమాంచి, ఆంధ్రా పీపుల్ ఆఫ్ సెంట్రల్ ఓహియో మాజీ అధ్యక్షుడు సుధాకర్ అల్వాల, కమ్యూనిటీ నాయకులు శ్రీనివాస్ బొద్దు, భరత్ జటప్రోలు.. తమ మద్దతుతోపాటు ప్రోత్సాహాన్ని అందించారు.
ఈ సందర్భంగా ఓహియో వ్యాలీ ప్రాంతీయ ప్రతినిధి ప్రదీప్ చందనం, తానా జాతీయ అధ్యక్షుడు డా. నరేన్ కొడాలి, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ లావు ప్రోత్సాహం, నిరంతర మద్దతుకు కృతజ్ఞతలు తెలిపారు. టోర్నమెంట్‌ను విజయవంతంగా నిర్వహించడంలో కీలక పాత్ర పోషించిన సత్య నిమ్మల, గత ప్రాంతీయ ప్రతినిధి శ్రీనివాస్ సంగకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. స్నేహభావం, ఐక్యత, క్రీడాస్ఫూర్తిని పెంపొందించే లక్ష్యంతో తానా నిర్వహిస్తున్న ఇలాంటి కార్యక్రమాలు అమెరికాలోని తెలుగు సమాజాన్ని మరింత దగ్గర చేస్తున్నాయని నిర్వాహకులు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఫ్రిస్కోలో మహిళల ఆరోగ్యంపై టాంటెక్స్ సదస్సు
వాషింగ్టన్ డీసీలో శంకర నేత్రాలయ నిధుల సేకరణ కార్యక్రమం
For More Telugu News And NRI News