ఫ్రిస్కోలో మహిళల ఆరోగ్యంపై టాంటెక్స్ సదస్సు
ABN , Publish Date - Mar 03 , 2026 | 09:18 PM
ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) వనితా వేదిక ఆధ్వర్యంలో యునైటెడ్ ఇన్ వెల్‌నెస్ – సెలబ్రేటింగ్ ఉమెన్ ఇన్ అవర్ కమ్యూనిటీ పేరిట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు అధ్యక్షురాలు లోకిరెడ్డి మాధవి ఒక ప్రకటనలో తెలిపారు.
ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) వనితా వేదిక ఆధ్వర్యంలో యునైటెడ్ ఇన్ వెల్‌నెస్ – సెలబ్రేటింగ్ ఉమెన్ ఇన్ అవర్ కమ్యూనిటీ పేరిట మహిళల ఆరోగ్య ప్రాధాన్యతపై అవగాహన కల్పించే కార్యక్రమాన్ని ఈ శనివారం నిర్వహిస్తున్నట్లు అధ్యక్షురాలు లోకిరెడ్డి మాధవి ఒక ప్రకటనలో తెలిపారు. మహిళల శారీరక, మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యమిస్తూ, సమాజంలో ఐక్యతను బలోపేతం చేయడం ఈ కార్యక్రమం లక్ష్యమని ఆమె వెల్లడించారు. మార్చి 7న శనివారం ఉదయం 8:30 నుండి 11:00 గంటల వరకు 10YEC – యూత్ ఎక్సలెన్స్ సెంటర్, 7600 కాటన్ వుడ్ స్ట్రీట్, ఫ్రిస్కోలో నిర్వహిస్తున్నారు.
యోగా సెషన్, వైద్య నిపుణుల ఆధ్వర్యంలో మహిళల ఆరోగ్యంపై చర్చ వంటివి ఏర్పాటు చేశారు. ఇందులో పాల్గొన దలిచిన వారు తమ యోగా మ్యాట్స్ తీసుకురావాలని కోరారు. కార్యక్రమంలో భాగంగా దుస్తుల సేకరణ కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నారు. చీరలు, లెహంగాలు, ఆభరణాలను స్వీకరిస్తామని నిర్వాహకులు తెలిపారు. మరిన్ని వివరాలకు వనితా వేదిక సమన్వయకర్త దీపికా పేటను టాంటెక్స్ వెబ్‌సైట్ ద్వారా సంప్రదించవచ్చని తెలిపారు.

ఈ వార్తలూ చదవండి:
సౌదీలోని తెలుగు కుటుంబంలో విషాదం.. తల్లిదండ్రులను చంపిన టీనేజర్
వాషింగ్టన్ డీసీలో శంకర నేత్రాలయ నిధుల సేకరణ కార్యక్రమం