Share News

తానా ఆధ్వర్యంలో సీపీఆర్, ఏఈడీ శిక్షణా కార్యక్రమం

ABN , Publish Date - Mar 09 , 2026 | 06:45 PM

సామాజిక సేవా కార్యక్రమాల్లో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ముందుంటుంది. తానా ఆధ్వర్యంలో చార్లెట్ టీం.. శ్రీ సాయి గురు దేవదత్త మందిరం, ‘హార్ట్‌సేఫ్ వర్క్‌ప్లేస్’ సంయుక్తంగా నార్త్ కరోలినాలోని కాంకర్డ్‌లో సీపీఆర్, ఏఈడీ శిక్షణ సర్టిఫికేషన్ కార్యక్రమాన్ని నిర్వహించింది.

తానా ఆధ్వర్యంలో సీపీఆర్, ఏఈడీ శిక్షణా కార్యక్రమం

వాషింగ్టన్: సామాజిక సేవా కార్యక్రమాల్లో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ముందుంటుంది. తానా ఆధ్వర్యంలో చార్లెట్ టీం.. శ్రీ సాయి గురు దేవదత్త మందిరం, ‘హార్ట్‌సేఫ్ వర్క్‌ప్లేస్’ సంయుక్తంగా నార్త్ కరోలినాలోని కాంకర్డ్‌లో సీపీఆర్, ఏఈడీ శిక్షణ సర్టిఫికేషన్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి కమ్యూనిటీ నుంచి అద్భుతమైన స్పందన లభించింది. దాదాపు 60 మందికిపైగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆపద సమయంలో ప్రజల ప్రాణాలను రక్షించే కీలక నైపుణ్యాలను వారంతా ఎంతో ఉత్సాహంగా నేర్చుకున్నారు.


NRI-1.jpgకబారస్ కౌంటీకి చెందిన మిస్టర్ మాథ్యూ ఈ శిక్షణ శిబిరాన్ని నిర్వహించారు. ఆయన తన విలువైన సమయాన్ని వెచ్చించి, సీపీఆర్ పద్ధతులతోపాటు ఏఈడీ పరికరాలను ఆపద సమయంలో ఎలా ఉపయోగించాలో ప్రతి ఒక్కరికీ అర్థమయ్యేలా వివరించారు. మిస్టర్ మాథ్యూ నైపుణ్యం, సహనంతోపాటు ప్రత్యక్షంగా ఆయన ప్రదర్శనలు.. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపాయి.


NRI-2.jpgఅత్యవసర సమయాల్లో ప్రాణాపాయం నుంచి ఎవరినైనా ఎలా కాపాడాలో.. నేర్చుకునే అవకాశం లభించినందుకు వారందరూ సంతోషం వ్యక్తం చేశారు. తానా సారథ్యంలో ఈ కార్యక్రమాన్ని ఇంత సమర్థవంతంగా నిర్వహించినందుకు శిక్షకుడితోపాటు పాల్గొన్నవారందరికీ తానా కృతజ్ఞతలు తెలిపింది.


NRI-4.jpg

డాక్టర్ నరేన్ కొడాలి (తానా ప్రెసిడెంట్), శ్రీనివాస్ లావు (ఈవీపీ) నిరంతర ప్రోత్సాహం, నాయకత్వంతో ఈ ఆరోగ్య కార్యక్రమాలకు అండగా నిలిచారు. హెల్త్ సర్వీసెస్ కో ఆర్డినేటర్ మాధురి ఏలూరి ఈ కార్యక్రమాన్ని సమన్వయ పరిచారు. రవి (నాని) వడ్లమూడి (తానా అప్పలచియన్ రీజినల్ రిప్రజెంటేటివ్), నాగ పంచమర్తి (స్పెషల్ ప్రాజెక్ట్స్ కో ఆర్డినేటర్), కిరణ్ కొత్తపల్లి (టీమ్ స్క్వేర్ చైర్), ఠాగూర్ మల్లినేని (ఫౌండేషన్ ట్రస్టీ) తమ మద్దతు, మార్గదర్శకత్వాన్ని అందించారు.


Nri5.jpgయువ వాలంటీర్ కీర్తన కొత్తపల్లి ఈ కార్యక్రమంలో ఎంతో ఉత్సాహంగా పాల్గొని తన వంతు సహాయ సహకారాలను అందించారు. ఇది యువతరంలో ఉన్న సేవాభావాన్ని ప్రతిబింబించింది. తానా చార్లెట్ టీం, వాలంటీర్ల కృషితోపాటు టీమ్ వర్క్‌ను ప్రతిఒక్కరు ప్రశంసలతో ముంచెత్తారు. ఇటువంటి కార్యక్రమాల ద్వారా తానా.. ఆరోగ్యంపై అవగాహన పెంచడమే కాకుండా, అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలను కాపాడేందుకు అవసరమైన ధైర్యాన్ని, జ్ఞానాన్ని సామాన్యులకు అందిస్తూ తన సేవా నిరతిని మరోసారి చాటుకుంటోంది.


ఈ వార్తలు కూడా చదవండి..

యూఎస్‌లోని విద్యార్థులకు తానా గుడ్ న్యూస్

ఫ్రిస్కోలో మహిళల ఆరోగ్యంపై టాంటెక్స్ సదస్సు

For More Telugu News And NRI News

Updated Date - Mar 09 , 2026 | 07:48 PM