అమెరికా వీసా నిబంధనల్లో పెనుమార్పులు
ABN , Publish Date - Feb 10 , 2026 | 09:17 AM
అమెరికా వీసా నిబంధనల్లో పెనుమార్పులు తీసుకొచ్చారని అంతర్జాతీయ ఇమ్మిగ్రేషన్ అటార్నీ నడదూర్ ఎస్ కుమార్ పేర్కొన్నారు. మాదాపూర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
అంతర్జాతీయ ఇమ్మిగ్రేషన్ అటార్నీ నడదూర్ ఎస్ కుమార్
హైదరాబాద్: అమెరికా వీసా నిబంధనల్లో పెనుమార్పులు తీసుకొచ్చారని అంతర్జాతీయ ఇమ్మిగ్రేషన్ అటార్నీ నడదూర్ ఎస్ కుమార్ పేర్కొన్నారు. మాదాపూర్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. భారత విద్యార్థులకు జారీ చేసే ఎఫ్-1 వీసాల్లో 50శాతం తగ్గుదల నమోదైందని ఆయన వెల్లడించారు. హెచ్-1బీ వీసా నిబంధనల్లో వచ్చిన మార్పులు, పెరిగిన ఫీజులు, గ్రీన్‌కార్డు కోసం వేచి చూడాల్సిన సుదీర్ఘకాలం దృష్ట్యా భారతీయులకు ఈబీ-5 ఇన్వెస్టర్ ప్రోగ్రామ్ సురక్షితమైన, వేగవంతమైన ప్రత్యామ్నాయంగా మారిందన్నారు.
ప్రపంచ వ్యాప్తంగా రాజకీయ, ఆర్థిక చర్చల్లో ఇమ్మిగ్రేషన్ ప్రధాన అంశంగా ఉందన్నారు. విద్యార్థి, పని వీసాల నుంచి గ్రీన్‌కార్డు బ్యాక్‌లాగ్‌ల వరకు భారతీయుల దరఖాస్తులు గతంలో ఎన్నడూ లేనివిధంగా కఠినమైన తనిఖీలు, జాప్యాన్ని ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో ఈబీ-5 ఇన్వెస్టర్ ప్రోగ్రామ్ వంటి ప్రత్యాయ్నాయ మార్గాల గురించి తెలుసుకోవాలన్నారు. అమెరికా(America) వెలుపల ఉన్న కాన్సులేట్‌లలో వీసా పొందేందుకు ఎంప్లాయర్స్ లక్షల డాలర్లు చెల్లించాల్సి ఉంటుందని, అమెరికాలో ఉండి స్టేటస్ మార్చుకునే వారికి మాత్రం ఇది వర్తించదన్నారు.

మొత్తం హెచ్-1బీ వీసాలలో 70శాతం భారతీయులకే లభిస్తున్నప్పటికీ, గ్రీన్‌కార్డు కోసం 10 నుంచి 20ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ నిపుణులను అనిశ్చితిలో పడేస్తుందని ఆయన పేర్కొన్నారు. అయితే టార్గెటెడ్ ఎంప్లాయ్‌మెంట్ ఏరియాల్లోని రీజనల్ సెంటర్లలో 8లక్షల డాలర్ల పెట్టుబడి పెట్టడం ద్వారా గ్రీన్ కార్డు పొందే అవకాశం ఉందన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి.
బంగారం, వెండి స్వల్పంగా పెరిగాయ్.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..
Read Latest Telangana News and National News