మెల్‌బోర్న్ మహానాడు 2026 కార్యక్రమం.. విచ్చేసిన హరీశ్ గంటి
ABN , Publish Date - Jun 04 , 2026 | 01:40 PM
మెల్‌బోర్న్ మహానాడు 2026 కార్యక్రమంలో పాల్గొనేందుకు శ్రీ హరీశ్ గంటి మెల్‌బోర్న్‌కు విచ్చేశారు. ఈ సందర్భంగా తెలుగుదేశం మెల్‌బోర్న్ నాయకులు, కార్యకర్తలు, ఆయన స్నేహితులు ఘన స్వాగతం పలికారు.
ఇంటర్నెట్ డెస్క్: మెల్‌బోర్న్ మహానాడు 2026 కార్యక్రమంలో పాల్గొనేందుకు శ్రీ హరీశ్ గంటి మెల్‌బోర్న్‌కు విచ్చేశారు. ఈ సందర్భంగా తెలుగుదేశం మెల్‌బోర్న్ నాయకులు, కార్యకర్తలు, ఆయన స్నేహితులు ఘన స్వాగతం పలికారు. ఆయన్ను ఆహ్వానించిన వారిలో తెలుగుదేశం మెల్‌బోర్న్ అధ్యక్షులు శ్రీకాంత్ కొనిదెన, మోహన్ కమ్మ, ప్రకాశ్ సూరపనేని, సుమన్ దాసరి, శ్రీకర్ రావి, సూర్య ఘన్ని, సుమంత్ రెడ్డి, సాయికృష్ణ, నితిన్ విపర్ల, భరత్ కడియాల, శ్రీకాంత్ సరిపూడి, ఇతర పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తన 5 రోజుల మెల్‌బోర్న్ పర్యటనలో భాగంగా హరీష్ గంటి.. విక్టోరియా పార్లమెంట్, మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్(MCG)ను సందర్శించడంతో పాటు పలు అధికారిక సమావేశాలు, సామాజిక కార్యక్రమాలలో పాల్గొననున్నారు. ఆయన రాకతో పార్టీ శ్రేణులు, అభిమానులు, మిత్రులు ఉత్సాహంగా ఉన్నారు. మెల్‌బోర్న్ మహానాడు 2026తో పాటు ఈ పర్యటనలో నిర్వహించనున్న అన్ని కార్యక్రమాలు విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నారు. జోహార్ ఎన్టీఆర్! జై టీడీపీ! జై సీబీఎన్! జోహార్ బాలయోగి!
ఇవీ చదవండి:
మధుర ప్రవాసంలో కఠోర బాల్యం.. స్నేహితులు కరవై ఒంటరితనం
అమెరికా రాజధానిలో గన్నికి ఆత్మీయ సత్కారం