వేదికపై తడబడిన యువతి.. సీఎం యోగి ఆదిత్యనాథ్ ఏం చేశారంటే..
ABN , Publish Date - Oct 07 , 2026 | 05:30 PM
వేదికపై వందలాది మంది ముందు ప్రసంగిస్తున్నప్పుడు ఆ యువతి ఒక్కసారిగా తడబడిపోయింది. ఏం మాట్లాడాలో గుర్తు రాక కాసేపు నిశ్శబ్దంగా ఉండిపోయింది. ఆ సమయంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆమె పరిస్థితిని గమనించారు.
ఇంటర్నెట్ డెస్క్: వేదికపై వందలాది మంది ముందు ప్రసంగిస్తున్నప్పుడు ఆ యువతి ఒక్కసారిగా తడబడిపోయింది. ఏం మాట్లాడాలో గుర్తు రాక కాసేపు నిశ్శబ్దంగా ఉండిపోయింది. ఆ సమయంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆమె పరిస్థితిని గమనించారు. వెంటనే ఆయన చేసిన చిన్న పని ఆ యువతిలో మళ్లీ ఆత్మవిశ్వాసాన్ని నింపింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది (Yogi Adityanath viral video).
లఖ్‌నవూలో హెచ్‌సీఎల్ టెక్ ఐటీ సిటీ పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో సీఎం యోగి పాల్గొన్నారు. గోరఖ్‌పూర్‌లోని కౌరీరామ్‌కు చెందిన రచనా రాయ్ ప్రసంగించేందుకు వేదికపైకి వచ్చింది. పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సమక్షంలో మాట్లాడుతున్న సమయంలో ఆమె కొంత ఆందోళనకు గురైంది. సరిగ్గా మాట్లాడలేక కాసేపు నిశ్శబ్దంగా ఉండిపోయింది (Yogi Adityanath gesture).
రచనా రాయ్ పరిస్థితిని గమనించిన యోగి ఆదిత్యనాథ్ వెంటనే చప్పట్లు కొట్టి ఆమెను ప్రోత్సహించారు (HCL Tech Lucknow event). సభలోని ఇతరులు కూడా చప్పట్లు కొట్టేలా చేశారు. దీంతో ఆమె తిరిగి ప్రసంగాన్ని కొనసాగించింది. ఆ తర్వాత ఆత్మవిశ్వాసంతో తన ప్రసంగాన్ని పూర్తి చేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. యోగి ఆదిత్యనాథ్ సరైన సమయంలో స్పందించి యువతిని ప్రోత్సహించారని పలువురు నెటిజన్లు ప్రశంసించారు.
ఇవి కూడా చదవండి..
రాహుల్ గాంధీ సర్‌ప్రైజ్ ట్రిక్.. పోలీసుల ప్లాన్‌ను ఎలా మార్చారు..
యూపీఐ ఛార్జీల వల్ల లావాదేవీలు తగ్గవు: ఆర్బీఐ గవర్నర్ కీలక వ్యాఖ్యలు..